ఫ్యాబ్రికేషన్ కార్మికునికి రావలసిన వేతనం ఇప్పించిన కార్మిక నేత
బీఆర్‌టీయు రాష్ట్ర కార్మిక నాయకుడు- శ్రమశక్తి అవార్డు గ్రహీత రవి కృషి
మెహిదీపట్నం ఇండస్ట్రీయల్ ఏరియాలో “ఏపీ ఫ్యాబ్రికేషన్ వర్క్ షాప్” లో సంతోష్ కుమార్, ముత్తు అనే ఇద్దరు కార్మికులు ఫ్యాబ్రికేషన్ వర్క్ షాప్ లో గత కొన్ని సంవత్సరల నుంచి ఫ్యాబ్రికేషన్ వర్క్ షాప్ లో పని చేసేవారు. యాజమాన్యం కొన్ని అనివార్య కారణాల వల్ల వేతనం ఇవ్వకుండా నిర్లక్ష్యం చేయగా ఫ్యాబ్రికేషన్ వర్క్ మానేయడం జరిగింది. మొత్తం జనవరి నెల రావలసిన వేతనం ఇద్దరికీ కలిపి 60000/-రూపాయలు ఇవ్వాల్సి ఉండగా పలుమార్లు ఫ్యాబ్రికేషన్ వర్క్ షాప్ ఓనర్ ఎండి. పాండేని ఎంత అడిగిన నిర్లక్ష్యం వహిస్తూ పట్టించుకోకపోవడంతో విసుగు చెందారు. తమకు తెలిసిన తోటి కార్మికుల ద్వారా న్యాయం కోసం బీఆర్‌టీయు రాష్ట్ర కార్మిక నాయకుడు, శ్రమశక్తి అవార్డు గ్రహీత రవి గురించి తెలుసుకొని ఆయనను సంప్రదించారు. తన కార్యాలయం వద్దకు వచ్చి తమకు జరిగిన అన్యాయం గురించి వివరించారు. వెంటనే స్పందించిన కార్మిక నాయకుడు రవి… హుటాహుటిన మెహదీపట్నం లో ఉండే ఫ్యాబ్రికేషన్ వర్క్ షాప్ దగ్గరికి వెళ్లి ఓనర్ ఎండి. పాండే తో పలుమార్లు చర్చించి కార్మికుడికి మొత్తం రావాల్సిన వేతనం, 60000/- వేల రూపాయలు ఇప్పించడం జరిగింది. ఫ్యాబ్రికేషన్ కార్మికులు సంతోష్ కుమార్, ముత్తు మాట్లాడుతూ తమకు న్యాయం జరిగేలా కృషి చేసిన కార్మిక నాయకుడు రవికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అనిల్, సుదర్శన్, జగన్, కిరణ్, తదితరులు పాల్గొన్నారు.
