అక్షరగళం , బాలానగర్ డివిజన్ బీజేపీ అధ్యక్షులు డాక్టర్ కిరణ్ అధ్యక్షతన మంగళవారం బాలానగర్ డివిజన్ పరిధిలో ప్రజా సమస్యల పరిష్కారమే మా ఎజెండా అంటూ “మన బూత్ మన జెండా” అనే నినాదంతో ఇంటింటికి తిరుగుతూ బస్తీ బాట కార్యక్రమంను నిర్వహించడం జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీ వడ్డేపల్లి రాజేశ్వరరావు పాల్గొని, డివిజన్ ప్రజలు తెలియజేసిన స్థానిక సమస్యలను శ్రద్ధగా విని తెలుసుకున్నారు. అనంతరం ఆయా సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి తప్పకుండా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

ఈ సందర్భంగా శ్రీ వడ్డేపల్లి రాజేశ్వరరావు మాట్లాడుతూ, స్థానికంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను డివిజన్‌లోని బీజేపీ కార్యకర్తలకు, బూత్ అధ్యక్షులకు తెలియజేస్తే వాటిని తన దృష్టికి తీసుకువచ్చి పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. ప్రజలకు అండగా నిలిచేది కమలం జెండానే అని స్పష్టం చేస్తూ, బూత్ అధ్యక్షుల నివాసంపై కమలం జెండాను ఆవిష్కరించి ఎగురవేశారు.

ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ శ్రీకర్ రావు, బాలనగర్ డివిజన్ సీనియర్ బిజెపి నాయకులు దాసరి శంకర్ రెడ్డి, కొత్తూరు రమేష్, శివరంజని, ఎడ్ల అనిల్, రూప, డివిజన్ ప్రధాన కార్యదర్శి పాశం శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులు నర్సింగ్ రావు, దర్శన్, శ్రవణ్, డివిజన్ నాయకులు ధనరాజ్ తేజస్విని, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

