– బిహార్ ఎన్నికలల్లో SIR అంశంతో కేంద్రం పైన బురదజల్లే ప్రయత్నం చేశారు.
– BLO లు ఓటరు జాబితా పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది.
– ఇంకా గొప్పగా పేదలకు పని కల్పించాలని కేంద్రం సంకల్పం.
అక్షరగళం , మంగళవారం, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, ఎంపీ డీకే అరుణ, మహబూబ్ నగర్, ఎంపీ క్యాంపు కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పార్టీలకు అతీతంగా గెలిచిన సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలిపారు . అనంతరం ఈ సందర్భంగా డీకే అరుణ మాట్లాడుతూ గ్రామ సర్పంచ్ గా ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని మంచిగా ఉపయోగించుకోవాలని. గ్రామ అభివృద్ధికి కృషి చేయాలని కోరుతున్నాను అని అన్నారు. గ్రామ స్వరాజ్యం, గ్రామాల అభివృద్ధి కి పూర్తి స్థాయిలో సర్పంచ్ లు పని చేయాలని ఆశిస్తున్నాను.అని వికసిత్ భారత్ జీ రామ్ జీ బిల్లు తో గ్రామాల్లో నూతన శకం మొదలైంది. బిహార్ ఎన్నికలల్లో SIR అంశంతో కేంద్రం పైన బురదజల్లే ప్రయత్నం చేశారు.60 ఏళ్లు కాంగ్రెస్ అధికారంలో ఉంది.. మరి అప్పుడు ఓటు చోరీ అయ్యిందా.. బీజేపీ మూడవ సారి అధికారంలోకి వస్తె.. ఓటు చోరీ అంటున్నారు.బిహార్ ఎన్నికల ఫలితాలతో ప్రజలు ఎవరి పై విశ్వాసం ఉంచారో అందరికి తెలుసు.దేశవ్యాప్తంగా అర్బన్ ప్రాంతాల్లో లేని ఓట్లను జాబితాల్లో సృష్టించారు.కేంద్ర ఎన్నికల సంఘం ఓటరు జాబితా సవరణ చేస్తే.. తప్పుబట్టారు.BLO లు ఓటరు జాబితా పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది.ఉన్న ఓట్లను కూడా జాబితాలో నుంచి గతం ప్రభుత్వం తొలగించారు. తెలంగాణ లో కూడా రాబోయే రోజుల్లో SIR జరగబోతుంది. ఉపాధి హామీ పథకంలో మార్పులు తెస్తూ.. జీ రామ్ జీ బిల్లు ను కేంద్రం చట్ట సవరణ చేసింది.ఇంకా గొప్పగా పేదలకు పని కల్పించాలని కేంద్రం సంకల్పం.గ్రామాల్లో వ్యవసాయ పనులు ఉన్నప్పుడూ.. నాట్లు, కోతల సమయంలో 60 రోజులు హోలీ డే ఇవ్వడం…రైతులకు కూలీల కొరత లేకుండా తీసుకున్న నిర్ణయం. గతంలో వంద రోజులు పని కల్పిస్తే.. ప్రస్తుతం 125 రోజులకు పని రోజులు పెంచడం జరిగింది. ఉపాధి హామీ పథకం లో కూడ గతంలో పెద్ద రాజకీయం నడిచేది. ఇష్టం ఉన్నవాళ్లకు పనికి రాకపోయినా హాజరు వేసేది. ప్రస్తుతం ఆ అటువంటి అవకతవకలు లేకుండా బిల్లు తీసుకువచ్చింది. గ్రామాల్లో ఏ ఏ పనులు చేయాలో.. గ్రామ సభల్లో తీర్మానం చేసుకునే అవకాశం ఉంది. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యం ఉంటే మరింత బాధ్యతాయుతంగా పనులు జరుగుతాయని కేంద్రం భావించింది. కేంద్రం నిధులతోనే గ్రామాల్లో అభివృద్ధి జరుగుతుంది. రాజకీయంగా పతనమైన వారందరూ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ను ఉపయోగించుకుంటున్నారు. కేసీఆర్ మరోసారి పాలమూరు ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతున్నారు. పాలమూరు జిల్లాకు న్యాయం చేయాలనే చిత్తశుద్ధి లేదు. పదేళ్లు అధికారంలో ఉండి.. RDS ఎందుకు పూర్తి చేయలేకపోయారు. మల్లమ్మ కుంట అతిగతి లేదు… RDS అనేది అలంపూర్ కి మాత్రమే పరిమితం.. అయిన దానిని కూడా పూర్తి చేయకుండా అలంపూర్ రైతులకు అన్యాయం చేశారు. RDS తో ఆంధ్రా తెలంగాణ సెంటిమెంట్ రెచ్చగొట్టారు.కాళేశ్వరం లో లక్షల కోట్లు పెట్టిన కాళేశ్వరం చేశారు. కాళేశ్వరం పై ఉన్న శ్రద్ధ పాలమూరు రంగారెడ్డి పై ఎందుకు పెట్టలేదు. గజ్వేల్,సిద్దిపేట, సిరిసిల్ల లో రోడ్లు వేసుకున్నారు..పాలమూరు జిల్లా ఏం పాపం చేసింది. ప్రాజెక్టులకు నష్టం చేశారు.. విద్య వైద్యం ప్రతి దానిలో పాలమూరు కు కేసీఆర్ ద్రోహం చేశారు. బీజేపీ నీ ప్రశ్నించే హక్కు కేసీఆర్ కి లేనే లేదు అని అన్నారు. అంతే కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం సంపూర్ణంగా సహకరిస్తుంది. గత ప్రభుత్వ అప్పులు చాలవని… కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త అప్పులు చేస్తుంది. కాంగ్రెస్,BRS లు రెండు ఒక్కటే… తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాకుండా అడ్డుకునేందుకు రెండు పార్టీలు కుట్రలు చేస్తున్నారు. అందులో భాగమే కేంద్రం పై చేసే ఆరోపణలు..చేస్తున్నారు అని అన్నారు

