Wednesday, January 14, 2026
No menu items!
Advertisement
హోమ్జిహెచ్​​ఎంసినిజాంపేట డివిజన్ల విభజన శాస్త్రీయంగా జరగలేదు

నిజాంపేట డివిజన్ల విభజన శాస్త్రీయంగా జరగలేదు

– జిహెచ్ఎంసి కమిటీ కన్వీనర్‌కు వినతి పత్రం సమర్పణ

అక్షరగళం, నిజాంపేట : మున్సిపల్ కార్పొరేషన్‌ను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC)లో విలీనం చేసే ప్రక్రియలో భాగంగా ప్రభుత్వం చేపట్టిన అభిప్రాయ సేకరణ కార్యక్రమం రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో నిజాంపేట డివిజన్ల విభజన శాస్త్రీయంగా జరగలేదని పేర్కొంటూ జిహెచ్ఎంసి అభిప్రాయ సేకరణ కమిటీ కన్వీనర్ ఎన్.వి. ప్రభాకర్ కు నిజాంపేట్ బీజేపీ నాయకులు బిక్షపతి యాదవ్ వినతి పత్రం సమర్పించారు.

ప్రస్తుత డివిజన్ల విభజనలో భౌగోళిక పరిస్థితులు, జనాభా సమతుల్యత, మౌలిక వసతులు, ప్రజల అవసరాలు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోలేదని వినతి పత్రంలో పేర్కొన్నారు. ఈ కారణంగా ప్రజలకు పాలనాపరమైన ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని వివరించారు. నిజాంపేటను జిహెచ్ఎంసిలో విలీనం చేసే ముందు డివిజన్ల పునర్విభజనను శాస్త్రీయంగా, ప్రజలకు అనుకూలంగా చేపట్టాలని కమిటీకి సూచించారు. స్థానిక ప్రజాప్రతినిధులు, నిపుణులతో సంప్రదింపులు జరిపి తగిన మార్పులు చేయాలని ఆయన ఈ సందర్భంగా కోరారు.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments