Benguluru Fridge Crime:బెంగుళూరులో దారుణ సంఘటన జరిగింది.ఒక మహిళను 50 ముక్కలు చేసి ఫ్రిడ్జిలో పెట్టిన సంఘటన బెంగుళూరులో వెలుగులోకి వచ్చింది.తాజాగా పోలీసులు నిందితుడిని గుర్తించినట్లు చెప్పారు.మహిళా కమిషనర్ కూడా ఈ విషయంలో సీరియస్ గా ఉన్నారు.
Benguluru Fridge Crime:బెంగళూరులోని ఒక గదిలో ఫ్రిడ్జిలో 29 ఏళ్ల మహిళను నరికి ముక్కలుగా చేసిన్నట్లు గుర్తించారు. తాజాగా ప్రధాన నిందితుడిని గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. 50కి పైగా ముక్కలు నరికి ఫ్రిజ్‌లో దాచి పెట్టాడు. ఇది దిల్లీ శ్రద్ధా వాకర్ హత్య కేసు లాగా ఉంది.
సోమవారం బెంగుళూర్ కమిషన్ దయానంద్ మీడియాతో మాట్లాడారు.అన్ని కోణాల్లో కేసును దర్యాప్తు చేస్తున్నామని,నిందితుడు పశ్చిమ బెంగాల్లో ఉన్నటు గుర్తించామన్నారు. అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నామని దొరికిన వెంటనే వివరాలు చెప్తామన్నారు.బాధితురాలు మహాలక్ష్మి మల్లేశ్వరంలోని ఒక షాపింగ్ మాల్లో పని చేస్తుంది.తన భర్తకు దూరంగా జీవిస్తుందని సమాచారం.విషయం తెలిసిన తర్వాత తన భర్త కువ వచ్చినట్లు పోలీసులు తెలిపారు.
ఆదివారం తెల్లవారుజామున బాధితురాలి తల్లి, చెల్లితో పాటు కుటుంబ సభ్యులు మృతి దేహాన్ని కనుకొన్నారు.అయితే వారికీ ఒక షాకింగ్ వీడియొ కనిపించింది. 44 సెకండ్ల వీడియోలో వారి గదిలోకి రావడం కనిపించింది.బయపడిని కుటుంబ సభ్యులు పోలీసులకు తెలియచేశారు.
సమాచారం తెలుసుకున్న సీనియర్ అధికారులు,డాగ్ స్క్వాడ్స్,ఫోరెన్సిక్ నిపుణులతోపాటు సంఘటన స్థలానికి చేసుకున్నారు. ఈ హత్య 3 టు 4 డేస్ కిత్రం జరిగినట్లుగా గుర్తించారు.అదనపు పోలీసు కమిషనర్(వెస్ట్ జోన్) ఎన్.సతీష్ కుమార్ మాట్లాడుతూ.. ‘మహిళ మృతదేహాన్ని ముక్కలుగా నరికి ఫ్రిజ్‌లో ఉంచినట్టు గుర్తించాం. అయితే బాధితురాలు భర్తతో కాకుండా విడిగా జీవిస్తున్నట్టు అక్కడి వారు తెలిపారు.
జాతీయ మహిళా కమిషన్(NCW) ఈ విషయంపై స్పందించారు. ‘బెంగళూరులో మహిళను ముక్కలుగా నరికి ఫ్రిజ్‌లో దాచిపెట్టిన విషయం తెలిసింది. ప్రమేయం ఉన్న వారందరినీ మీద త్వరగా యాక్షన్ తీసుకోవాలని తెలిపారు.సమగ్రమైన విచారణ చేయండి.’ అని కమిషన్ పేర్కొన్నారు.
అనుమానితుడు పశ్చిమ బెంగాల్‌కు చెందినవాడని భావిస్తున్నామని, ఈ కేసుకు సంబంధించి సమాచారం, ఆధారాలను పోలీసులు సేకరించారని కర్ణాటక హోం మంత్రి తెలిపారు. అయితే ఈ కేసుకు సంబంధించి మరి కొన్ని వివరాలు తెలియాల్సి ఉందని పేర్కొన్నారు. బెంగళూరులో మహిళల భద్రత కోసం ప్రభుత్వం అనేక చర్యలను అమలు చేసిందని, ఆయన ఈలాంటి సంఘటనలు జరగడం బాధాకరం అని అన్నారు.
బెంగళూరులో జరిగిన సంఘటన 2022లో దిల్లీలో జరిగిన శ్రద్ధా వాకర్ హత్య కేసును పోలి ఉంది. దిల్లీలో 28 ఏళ్ల అఫ్తాబ్ పూనావల్లా.. వాకర్‌ను గొంతుకోసి చంపేశాడు. ఆమె శరీరాన్ని 35 ముక్కలుగా చేసి ఫ్రిజ్‌లో దాచి పెట్టాడు. తర్వాత వాటిని పారవేశాడు. ఈ కేసు అప్పట్లో సంచలనమైంది. ఇప్పుడు బెంగళూరులోనూ ఇలాంటి ఘటనే మళ్ళి జరిగింది.