Monday, December 23, 2024
spot_img
Homeక్రైమ్ఫోన్ లు చేస్తారు.. బెదిరిస్తారు.. న‌మ్మొద్దు

ఫోన్ లు చేస్తారు.. బెదిరిస్తారు.. న‌మ్మొద్దు

నేటి ఆధునిక కాలంలో సైబ‌ర్ నేర‌స్థులు ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త ఎత్తులు వేస్తున్నారు. అప్ర‌మ‌త్తంగా ఉంటేనే సైబర్‌ నేరాలకు అడ్డుకట్ట వేయొచ్చని బాలానగర్‌ జోన్ డీసీపీ సురేశ్‌ కుమార్‌ అన్నారు. ప్రజలకు సైబర్‌ నేరాల తీరుపై మ‌రింత అవగాహన కల్పిచేందుకు ఓ వీడియోను విడుద‌ల చేశారు.

‘ఇటీవలి కాలంలో మా దృష్టికి ఎక్కువగా ఫెడెక్స్, కొరియర్‌ పేరుతో మోసం జరిగినట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. ఎవరో గుర్తు తెలియని వ్యక్తి ఫోన్‌ చేస్తారు. మీకూ ఓ పార్సిల్‌ వచ్చిందని చెప్తారు. అందులో మత్తు పదార్థాలున్నాయని భయపెడుతారు. మీ ఆధార్‌ కార్డు వాడి ఎక్కడో నేరం చేశారని భయపెడుతారు. దాంతో మీరూ భయపడుతారు. పోలీసుల అధికారిలాగే ఫోన్‌లో మాట్లాడుతారు. వీడియో కాల్‌ చేస్తారు. గంటల పాటు ఫోన్‌లో మాటాలతో మాయ చేస్తారు. మీరు ముంబాయి, ఇతర ప్రాంతాలకు రావాల్సి ఉంటుందని ఆదేశిస్తారు. మీరు ఇక్కడికి రాలేని పక్షంలో మీ అకౌంట్‌లో ఉన్న నగదును ఆర్‌బీఐకి బదిలీ చేయాల్సి ఉంటుందని, మీరు నిజంగా ఏ నేరం చేయకపోతే మీ పైసలు మీకు తిరిగిస్తామంటారు. వారు చెప్పిన మాటల నమ్మి పైసలు వేస్తే వారు ఫోన్‌ స్విచ్‌ఆఫ్‌ చేస్తారు. ఇలాంటి ఘటనలు మీ దృష్టికి వస్తే సైబర్‌ క్రైమ్‌కి ఫిర్యాదు చేస్తామని చెప్పండి. డబ్బులు పొగొట్టుకుంటే గంట లోపే 1930 నంబర్‌కి ఫోన్‌ చేసి ఫిర్యాదు చేస్తే డబ్బులు వెనక్కి వచ్చే అవకాశం ఉంటుంది.’’ ప్రతీ ఒక్కరు సైబర్‌ నేరాలపై అవగాహన కలిగి ఉండాలని, గుర్తు తెలియని వ్యక్తులు పలు సంస్థల పేర్లు చెప్పి డబ్బులు, లింక్‌లు ఒపెన్‌ చేయాలని చెప్తారు. ఫోన్‌లో గంటల తరబడి లైన్‌లో ఉంచతూ బెదిరిస్తారని అలాంటి వాటికి ఎట్టిపరిస్థితుల్లో భయపడొద్దని డీసీపీ సూచించారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments