aksharagalam.com

AIలో ఇండియా పవర్‌ షో.. ప్రపంచం దృష్టి భారత్‌పైనే!

– 2023లో ఏడో స్థానంలో…
– 2024లో ఏకంగా మూడో స్థానానికి భారత్

అక్షరగళం, హైదరాబాద్: కంటికి కనిపించవు.. కానీ ప్రపంచాన్ని కదిలిస్తున్నాయి. చిటికేసేలోపే నిర్ణయాలు తీసుకుంటున్నాయి. మనిషి ఆలోచనలకే సవాల్‌ విసురుతున్నాయి. అదే కృత్రిమ మేధలు AI.
ప్రపంచాన్ని శాసించబోతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో భారత్ మరో చరిత్ర సృష్టించింది.
ప్రపంచ ర్యాంకింగ్స్‌లో అమెరికా, చైనా సరసన నిలిచి టాప్‌ త్రీ దేశాల్లోకి దూసుకెళ్లింది ఇండియా.

అన్ని రంగాలలో
ప్రస్తుత తరుణం అన్ని రంగాలను AI ప్రభావితం చేస్తుంది అనేది వాస్తవం. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కీలక శక్తిగా మారిన ఈ టెక్నాలజీలో ఇప్పుడు భారత్ వేగంగా అడుగులు వేస్తోంది. 2024 గ్లోబల్ AI వైబ్రెన్సీ ఇండెక్స్ విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో అమెరికా 78.60 పాయింట్లతో తొలి స్థానంలో నిలిచింది. సిలికాన్ వ్యాలీ, MIT, స్టాన్‌ఫోర్డ్ లాంటి పరిశోధనా కేంద్రాలు
అమెరికాను ఏఐలో అగ్రగామిగా నిలబెట్టాయి.

భారత్ వైపు చూపు…
ప్రపంచవ్యాప్తంగా 87 శాతం కంపెనీలు AIకి టాప్ ప్రాధాన్యం ఇస్తుండగా 76 శాతం సంస్థలు ఇప్పటికే AIని వినియోగిస్తున్నాయి. అయితే ఇక్కడ… అసలైన సెన్సేషన్ మాత్రం భారత్‌దే. అమెరికా, చైనా తర్వాత
ప్రపంచంలో మూడో అతిపెద్ద AI శక్తిగా భారత్ అవతరించింది. దీంతో ఇండియాలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపిస్తున్నారు విదేశీ పెట్టుబడిదారులు. భారత్ తర్వాత దక్షిణ కొరియా 17.24 పాయింట్లతో నాలుగో స్థానంలో, యునైటెడ్ కింగ్‌డమ్ 16.64 పాయింట్లతో ఐదో స్థానంలో నిలిచాయి.

భారత్ వైపు బిలియన్ల డాలర్ల పెట్టుబడులు

భారత్‌లో AI భవిష్యత్తును చూసి ప్రపంచ దిగ్గజాలు బిలియన్ల డాలర్లు పెట్టుబడి పెడుతున్నాయి. అమెజాన్ – 2030 నాటికి AI, లాజిస్టిక్స్, క్లౌడ్ కోసం 35 బిలియన్ డాలర్లు, 🔹 మైక్రోసాఫ్ట్ – AI, క్లౌడ్ విస్తరణకు 17.5 బిలియన్ డాలర్లు🔹 ఇంటెల్, కాగ్నిజెంట్, ఓపెన్‌ఏఐ లాంటి సంస్థలూ భారత్‌లో భారీ పెట్టుబడులు, భాగస్వామ్యాలకు ముందుకొస్తున్నాయి.

గ్లోబల్ లీడర్ గా..
ఎకానమీనే తో పాటుగా భవిష్యత్తు టెక్నాలజీల్లోనూ భారత్ సత్తా చాటుతోంది. AIలో టాప్‌ త్రీకి చేరడం భారత్ గ్లోబల్ లీడర్‌గా మారుతోందనేది స్పష్టమైన సంకేతం. రాబోయే రెండుమూడేళ్లలో ఇండియాలో AI విప్లవం ఆకాశమే హద్దుగా దూసుకెళ్లబోతోంది అనే అంశంలో అనుమానం లేదు అని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

Exit mobile version