శోభాయాత్రలో ముగ్గురు దుర్మరణం
అక్షరగళం, వెబ్ డెస్క్: దేశంలో అన్ని పండగల కన్నా వినాయక చవితిని అందరూ చాలా ఇష్టంగా జరుపుకుంటారు. నవరాత్రుల ప్రారంభం నుంచి నిమజ్జనం వరకు ఎంతో హడావిడిగా ఉంటుంది. ఈ పండుగ సమయంలో కొన్ని ప్రాంతాల్లో అపశృతి చోటుచేసుకుని.. కొన్ని కుటుంబాలలో విషాదాన్ని నింపింది. అన్నమయ్య జిల్లా పెద్దమండెం మండలం పాపేపల్లి వినాయక నిమజ్జనంలో అపశృతి చోటుచేసుకుంది.
వినాయకుడి నిమజ్జనానికి వెళుతున్న ట్రాక్టర్ బోల్తా పడిఒకరు మృతి చెందారు. అలాగే 10 మంది తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని సవిూపంలోని ఆస్పత్రికి తరలించారు. కడప జిల్లా చక్రాయపేట మండలంలో విషాదం చోటుచేసుకుంది. నేరేసు పల్లి క్రాస్ రోడ్డు వద్ద ట్రాక్టర్ కిందపడి ఒకరు చని పోయారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి.
ఆంజనేయపురం గ్రామానికి చెందిన గౌతం అనే యువకుడు మృతి చెందాడు. వినాయక నిమర్జనం అనంతరం ఇంటికి వస్తుండగా ఈ ఘటన జరిగింది. యువకుడి మృతితో అతడి కుటుంబాన్ని విషాద ఛాయలు అలుముకున్నాయి.
విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. మరో ఘటన తిరుపతి జిల్లాలో జరిగింది. వాకాడు మండలం తూపులి పాలెంలో వినాయక నిమజ్జనంలో ఆపశృతి చోటుచేసుకుంది. వినాయకుని నిమజ్జనం చేస్తూ ముగ్గురు యువకులు గల్లంతయ్యారు.
గల్లంతైన వారు నాయుడుపేటలోని కావమ్మ గుడి సెంటర్‌కు చెందిన మునిరాజా, ఫయాజ్, శ్రీనివాసులుగా స్థానికులు చెప్తున్నారు. శ్రీనివాసులు అనే అతని ని మెరైన్ పోలీసులు రక్షించారు. ఈ ఘటనలో ఫయాజ్ మృతి చెందగా.. గల్లంతైన మునిరాజా కోసం పోలీసులు గాలిస్తున్నారు.