మళ్ళీ చాపల్యం చాటుకున్న ట్రంప్
అమ్మాయిలపై కన్నేస్తున్న అమెరికా అధ్యక్షుడు
సెక్రటరీపై కన్నేసిన ట్రంప్…అబ్బో సూపర్ ఉంటుంది అని ప్రశంస…
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల పెన్సిల్వేనియాలో జరిగిన ఓ ర్యాలీలో తమ ఆర్థిక అజెండాను వివరించడానికి ప్రసంగిస్తూ అకస్మాత్తుగా వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ అందమైన ముఖం, “పెదవుల గురించి ప్రశంసల వర్షం కురిపించారు. 79 ఏళ్ల ట్రంప్ ఆర్థిక విజయాలపై మాట్లాడుతున్న సమయంలో సభ గురించి పక్కనపెట్టి తమ 28 ఏళ్ల ప్రెస్ సెక్రటరీ ఎంత అందంగా ఉందో అంటూ వ్యాఖ్యానించడం గమనార్హం. “మనం ఈ రోజు మన సూపర్ స్టార్, కరోలిన్‌ను కూడా తీసుకొచ్చాం. ఆమె గొప్పది కాదా? కరోలిన్ అద్భుతం?” అని ఆయన ఉత్సాహంగా అరుస్తున్న జనసందోహాన్ని ప్రశ్నించారు. అనంతరం తన కంటే 50 ఏళ్లు చిన్నదైన లీవిట్ శారీరక సౌందర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని ఆయన ప్రశంసించారు. డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ.. “మీకు తెలుసా, ఆమె టెలివిజన్‌లోకి వెళ్లినప్పుడు, ఫాక్స్ లాంటి ఛానెళ్లలో ఆధిపత్యం చెలాయించారు… ఆ అందమైన ముఖంతో, ఆపకుండా… చిన్న మెషిన్ గన్ లాగా కదిలే ఆ పెదవులతో ఆమె మాట్లాడినప్పుడు…” అని ట్రంప్ విచిత్రమైన శబ్దాలు చేస్తూ అన్నారు. ట్రంప్ తమ ప్రభుత్వ విధానాలను సమర్థిస్తూ లీవిట్ పని కొంచెం సులువే అని అన్నారు. “ఆమెకు ఏ భయం లేదు… ఎందుకంటే మన దగ్గర సరైన విధానం ఉంది. మనకు మహిళల క్రీడలలో పురుషులు లేరు… ప్రపంచం మొత్తం జైళ్లు, ఇతర చోట్ల నుంచి మన దేశంలోకి వచ్చేలా సరిహద్దులు తెరవాల్సిన అవసరం లేదు. కాబట్టి ఆమెకు పని కొంచెం సులువుగా ఉంటుంది. అవతలి పక్షం ప్రెస్ సెక్రటరీగా నేను ఉండాలనుకోను.” అని ట్రంప్ పేర్కొన్నారు.
రిపబ్లికన్ నాయకుడు గతంలో ఆగస్టులో న్యూస్‌మ్యాక్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా లీవిట్‌పై ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. “అది ఆ ముఖం. ఆ మెదడు. ఆ పెదవులు, అవి కదిలే విధానం. ఆమె ఒక మెషిన్ గన్ లాగా కదులుతుంది,” అని అప్పట్లో కమాండర్-ఇన్-చీఫ్ లీవిట్ గురించి అన్నారు. “కరోలిన్ కంటే గొప్ప ప్రెస్ సెక్రటరీ ఎవరికీ దొరకలేదని నేను అనుకుంటున్నాను,” అని ఆయన అప్పుడు కూడా పేర్కొన్నారు.
కరోలినా లీవిట్ నేపథ్యం…
న్యూ హాంప్‌షైర్‌కు చెందిన కరోలిన్ లీవిట్ 2019 నుంచి 2021 వరకు ట్రంప్ మొదటి పరిపాలనలో అసిస్టెంట్ ప్రెస్ సెక్రటరీగా పనిచేశారు. కాంగ్రెస్ ఎన్నికల్లో విఫలమైన తర్వాత ఆమె జనవరిలో వైట్‌హౌస్‌కు తిరిగి వచ్చారు. ఆమె ట్రంప్ పరిపాలనలో ఐదో ప్రెస్ సెక్రటరీ, ఆయన రెండో పదవీకాలంలో మొదటి వ్యక్తి. ఆమె చరిత్రలో అతి పిన్న వయస్కురాలైన వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీగా నిలిచారు. ఆమె రియల్ ఎస్టేట్ డెవలపర్ నికోలస్ రిసియో (60)ను వివాహం చేసుకున్నారు. వారికి నికో అనే కుమారుడు ఉన్నాడు.

