‘కంపెనీలన్నీ ప్రారంభమైతే 20 లక్షల మందికి ఉపాధి’-సీఎం చంద్రబాబు
సంతోషంతో ఎగిరి గంటేస్తున్న ఏపీ ప్రజలు
ఉపాధికి ఢోకా ఉండదని ఆనందం
విశాఖ సమ్మిట్‌లో 613 ఎంవోయూలు కుదిరినట్లు సీఎం చంద్రబాబు వెల్లడించారు. రూ.13 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టేందుకు కంపెనీలు ముందుకొచ్చినట్లు తెలిపారు. కంపెనీలన్నీ ప్రారంభమైతే 20 లక్షల మందికి ఉపాధి లభించనుందని చెప్పారు. ‘అమెరికాకు సిలికాన్ వ్యాలీ, ఏపీకి క్వాంటం వ్యాలీ. అమరావతిలో త్వరలోనే క్వాంటం కంప్యూటింగ్ ప్రారంభం కానుంది’ అని పేర్కొన్నారు. ఈ విషయం విన్న ఏపీ ప్రజలు సంతోషంతో ఎగిరి గంతేస్తున్నారు. ఇకపై తమకు ఉపాధికి ఢోకా ఉండదని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

