తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రాభల్యం మరింత పెరిగుతోంది
-టీపీసీసీ ఉపాధ్యక్షుడు, కూకట్‌పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్
కాంగ్రెస్‌కు కలిసి వచ్చిన జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో పార్టీ గెలుపు- గ్లోబల్ సమ్మిట్ విజయం
కుత్బుల్లాపూర్, డిసెంబర్ 11
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక లో పార్టీ గెలుపు మరియు గ్లోబల్ సమ్మిట్ నిర్వహణ అనంతరం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఆదరణ మరింత పెరుగుతోందని టి పి సి సి ఉపాధ్యక్షుడు కూకట్‌పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్ పేర్కొన్నారు. జిహెచ్ఎంసి ఎన్నికల్లో నియోజకవర్గ పరిధిలోని 15 డివిజన్లను కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. గ్రేటర్ పరిధిలోని డివిజన్ల పునర్విభజన నేపథ్యంలో వాటి పేర్ల మార్పుపై మరియు నైసర్గిగా స్వరూపo మార్పుపై అయన కూకట్పల్లి నియోజవర్గ పార్టీ కార్యాలయం హేమదుర్గా భవన్లో బ్లాక్ డివిజన్ అధ్యక్షులు ఎన్ఎస్యుఐ మహిళా విభాగం నాయకురాళ్లతో కలిసి సమావేశం నిర్వహించారు.
ఆయా డివిజన్ల పార్టీ నాయకుల అభిప్రాయాన్ని ఆయన అడిగి తెలుసుకున్నారు, కాగా డివిజన్ పేర్లను నైసర్గిక స్వరూపాన్ని మార్చాల్సిన అవసరం లేదన్న అభిప్రాయం మెజార్టీ నాయకుల నుండి వెలువడింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని పేద ప్రజలకు మేలు జరిగేలా విద్యా వైద్య రంగాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందన్నారు .రాష్ట్రంలో పాలన పరుగులు పెడుతుంది అన్నారు.
డివిజన్ల గెలుపు కోసం కార్యకర్తలు నాయకులు ఈరోజు నుంచే పని ప్రారంభించాలని బండి రమేష్ సూచించారు. నియోజకవర్గం కాంగ్రెస్ సీనియర్ నాయకులు, బ్లాక్ అధ్యక్షులు, మరియు డివిజన్ అధ్యక్షులు, మార్కెటింగ్ కమిటీ మెంబెర్స్, టెంపుల్ కమిటీ మెంబర్స్ ,బ్లాక్ అద్యక్షులు, బ్లాక్ మహిళా అధ్యక్షురాలు, , డివిజన్ మహిళా అధ్యక్షురాలు , యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్‌యూఐ నాయకులు, మైనారిటీ నాయకులు, ఎస్పీ సెల్ నాయకులు, బీసీ సెల్ నాయకులు, సేవ్ దళ్ నాయకులు మరియు కార్యకర్తలు మరియు కాంగ్రెస్ పార్టీ అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

