తెలంగాణ బీజేపీ ఎంపీలపై ప్రధాని మోదీ సీరియస్
ఏపీలో చంద్రబాబు పాలనపై ప్రధాని మోదీ ఏమన్నారంటే..?
తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ బలం పెంచాలన్న మోదీ
భవిష్యత్తు బీజేపీదేనని తేల్చిచెప్పిన ప్రధాని
ఏపీలో సీఎం చంద్రబాబుతో కలిసి ముందుకు సాగడం మంచిదేనన్న మోదీ
తెలంగాణ బీజేపీఎంపీల పైన ప్రధాని మోదీ సీరియస్ అయినట్టు తెలుస్తోంది. తెలంగాణలో బీజేపీకి మంచి భవిష్యత్ ఉన్నా… పార్టీ నేతలు ప్రతిపక్ష పాత్ర సరిగా లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపేందుకు సమస్య ఏంటని ప్రశ్నించారు. తెలంగాణలో బీజేపీ పార్టీ గ్రాఫ్ పెరగడానికి మంచి అవకాశం ఉన్నా దాన్ని ఉపయోగించుకోవడంలో బీజేపీ నేలు విఫలమవుతున్నారని అసహనం వ్యక్తం చేసారు.
ప్రధాని మోదీ ఏపీ సీఎం చంద్రబాబు పాలనపై కీలక వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ సమావేశాల సందర్భంగా అన్ని రాష్ట్రాల బీజేపీ ఎంపీలో ప్రధాని సమీక్ష నిర్వహించారు. అందులో భాగంగా బీజేపీ ఎంపీలో ప్రధాని మోదీ తెలుగు రాష్ట్రాల ఎంపీలతో సమాశేశం నిర్వహించారు. ఏపీకి సంబంధించిన పెట్టుబడుతు…చంద్రబాబు పాలన విషయాలపై ప్రధాని మోదీ ఆసక్తికరమైన విశ్లేషణ చేశారు.
ఏపీ, తెలంగాణ, అండమాన్ రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని అల్పాహార విందు ఇచ్చారు. 15 మంది ఎంపీలతో సుమారు అరగంటపాటు మాట్లాడారు. ఏపీ, తెలంగాణ లో ప్రస్తుత రాజకీయ అంశాలను ప్రస్తావించారు. ఎంపీల నుంచి పార్టీ పరంగా చేపడుతున్న కార్యక్రమాలు.. ప్రజా స్పందన గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సమావేశంలో ప్రతిపక్షాల పస్తావన కూడా మోదీ తీసుకువచ్చారు.
తెలంగాణ, ఎంపీలకు…తాజా పరిస్థితుల పై ఫీడ్ బ్యాక్ వివరిస్తూ ప్రధాని మోదీ కీలక దిశా నిర్దేశం చేసారు. గతం కంటే పార్టీకి ప్రజల్లో ఆదరణ పెరిగిందని ఎంపీ లు ప్రధానికి వివరించారు. ఏపీకి పెట్టుబడులు ఎక్కువగా రావడం మంచి పరిణామమని ప్రధాని అన్నారు
ఎన్డీఏ పైన ప్రత్యర్థి పార్టీలు చేస్తున్న విమర్శలను బలంగా తిప్పికొట్టాలని ఎంపీలు ప్రధాని సూచించారు. సోషల్ మీడియాను సద్వినియోగం చేసుకునేందుకు కావాల్సిన టీంలను రేడీ చేసుకోవాలన్నారు.
దేశంలో జరుగుతున్న అన్ని విషయాలపై అవగాహన పెంచుకునేందుకు తెలుగు ఎంపీలు యాక్టివ్‌గా ఉండాలని ప్రధాని సూచించారు. అందుకు వివిధ రాష్ట్రాల్లో పర్యటించి ఆయా అంశాలను ప్రజల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేయాలని మోదీ సూచించారు. జాతీయ నాయకత్వంతో సమన్వయం చేసుకోని తెలంగాణలో ముఖ్య నేతలు తరచూ పర్యటనలు చేసేలా ప్లాన్ చేసుకోవాలని ఈ సందర్ంగా ప్రధాని తెలిపారు. భవిష్యత్తులో తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ బలం మరింతగా పెరిగేలా దూకుడుగా వ్యవహరించాలని ప్రధాని మోదీ ఎంపీలకు దిశా నిర్దేశం చేసారు.

