Wednesday, January 14, 2026
No menu items!
Advertisement
హోమ్సినిమాప్రేమ అద్భుతమా .. అవసరమా?: ఓటీటీకి రొమాంటిక్ మూవీ!

ప్రేమ అద్భుతమా .. అవసరమా?: ఓటీటీకి రొమాంటిక్ మూవీ!

ప్రేమ అనే రెండు అక్షరాలు చేసే చిత్రాలు .. విచిత్రాలు అన్నీ ఇన్నీ కావు. ప్రేమ గురించి ఎంతోమంది కవులు ఎన్నో రాశారు. ఎన్నో నిర్వచనాలు ఇచ్చారు. అయితే ఎవరికి వారు స్వయంగా రాసుకోవడానికీ .. నేర్చుకోవడానికే ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. అదే ప్రేమలో ఉన్న మహత్తు. పెళ్లి చేసుకోవద్దని ఎవరైనా చెబితే వినేవాళ్లు ఉంటారేమోగానీ, ప్రేమలో పడొద్దని చెబితే వినేవాళ్లు మాత్రం దాదాపుగా ఉండరనే అనాలి.
అలా ప్రేమ కోసం తపించే ఓ యువకుడి కథనే ‘ఆరోమలే’. అజిత్ .. అంజలి పాత్రలలో కిషన్ దాస్ – శివాత్మిక రాజశేఖర్ నటించిన ఈ సినిమా, నవంబర్ 7వ తేదీన థియేటర్లకు వచ్చింది. శారంగ్ త్యాగు దర్శకత్వం వహించిన ఈ సినిమా, అక్కడి యూత్ ను బాగానే ఆకట్టుకుంది. ప్రేమించి పెళ్లి చేసుకోవాలనేది అజిత్ కోరిక. అయితే సినిమాలలో చూపించే స్థాయిలో ఆ ప్రేమ అద్భుతంగా ఉండాలనేది ఆయన ఆశ.
ఇక అంజలి విషయానికి వస్తే, ఆమెకి ప్రేమపై ఎలాంటి ఫీలింగ్స్ ఉండవు. అవసరాలను బట్టి ప్రేమ పుడుతూ ఉంటుంది .. అవకాశాలను బట్టి మారుతూ ఉంటుందనేది ఆమె అభిప్రాయం. ఒక్క మాటలో చెప్పాలంటే అదో పెద్ద టైమ్ వేస్ట్ ప్రోగ్రామ్ అనేది ఆమె ఉద్దేశం. అలాంటి ఈ ఇద్దరూ తారసపడితే ఎవరు ఎవరిని ప్రభావితం చేసే అవకాశ ఉంటుంది? అనేదే కథ. ఈ నెల 12 నుంచి ‘జియో హాట్ స్టార్’లో, తమిళంతో పాటు తెలుగు .. మలయాళ .. కన్నడ .. హిందీ భాషల్లో ఈ సినిమా అందుబాటులోకి రానుంది.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments