విద్యతోనే అభివృద్ధి సాధ్యం
విద్య ద్వారానే సమాజంలో ఎదుగుదల,గౌరవం మరియు గొప్ప స్థానం లభిస్తుంది.
-సీపీఐ జిల్లా కార్యదర్శి ఉమా మహేష్.

జగద్గిరిగుట్ట ఉన్నత పాఠశాలలోని పదవ తరగతి విద్యార్థులకు నేడుసీపీఐ జిల్లా కార్యదర్శి ఉమా మహేష్160 మంది విద్యార్థులకు ఇన్ వన్ పుస్తకాలను పంపిణి చెయ్యడం జరిగింది.
ఈ సందర్బంగా ఉమా మహేష్ మాట్లాడుతూ… విద్య ఏ ఒక్కరి సొత్తు కాదని, వాస్తవానికి ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థులే నేడు అనేక ఉన్నత పదవులో ఉన్నారన్నారు. ప్రభుత్వ అధికారులు, కలెక్టర్లు,ఐపీఎస్ అధికారులు ఎక్కువగా ప్రభుత్వ పాఠశాలలో చదివిన వాళ్లేనాని… అంత ఎదుగుదల ప్రభుత్వ పాఠశాలలో ఉందని కావున విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థానాలను అధిరోహించాలని కోరారు.
మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని అని చెప్పుకున్నారని, కావున మన ప్రాంతంలో చదివే పిల్లలు అధికారులుగా ఎదిగి ఈ ప్రాంతానికి, ప్రజలకు సహాయం చేసి ఒక మంచి సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని కోరారు.
విద్యార్థులకు మండల సహాయ కార్యదర్శి హరినాథ్,జర్నలిస్ట్ నాయకులు తొండ వెంకట్, బాబు, వంశీలు కుడా పుస్తకాలను పంపిణి చేశారు.
ఈ కార్యక్రమానికి ప్రధానోపాధ్యాయులు సుభాష్ చంద్రబోస్ అధ్యక్షత వహించగా ఉపాధ్యాయులు సుధాకర్, రత్నంలు పాల్గొన్నారు.


