Wednesday, January 14, 2026
No menu items!
Advertisement
హోమ్తెలంగాణకేంద్ర మంత్రి హెచ్.డి. కుమారస్వామిని క‌లిసిన రాష్ట్ర నాయ‌కులు

కేంద్ర మంత్రి హెచ్.డి. కుమారస్వామిని క‌లిసిన రాష్ట్ర నాయ‌కులు

కేంద్ర మంత్రి హెచ్.డి. కుమారస్వామిని క‌లిసిన రాష్ట్ర నాయ‌కులు
ఎచ్ఎంటి మెషిన్ టూల్స్ పునరుద్ధరణ చేయాలి…
ఉద్యోగుల బకాయలు చెల్లించాలని విన‌తి ప‌త్రం అంద‌జేత‌
సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి హెచ్.డి. కుమారస్వామి

భారీ పరిశ్రమలు, ప్రభుత్వ రంగ సంస్థల శాఖ మంత్రి హెచ్.డి. కుమారస్వామిని లోకసభ సభ్యులు మల్లు రవి, ఈటెల రాజేందర్, హిబి ఇడెన్, రాజ్యసభ సభ్యులు జాన్ బ్రిస్టాస్, మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్‌లు క‌లిసి ఎచ్ఎంటి మెషిన్ టూల్స్ పునరుద్ధరణ మరియు ఉద్యోగుల బకాయలు చెల్లించాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు

న్యూఢిల్లీ భారీ పరిశ్రమలు మరియు ప్రభుత్వ రంగ సంస్థల శాఖ కార్యాలయంలో లోకసభ సభ్యులు మల్లు రవి, ఈటెల రాజేందర్, హిబి ఇడెన్, కేరళ రాజ్యసభ సభ్యులు జాన్ బ్రిస్టాస్ ఎంవోఎస్ భూపతి రాజుతో పాటు మాజీ ఎమ్మెల్యే, హైదరాబాద్ ఎచ్ఎంటి మెషిన్ టూల్స్ ప్రెసిడెంట్ కూన శ్రీశైలం గౌడ్, కేంద్ర మంత్రివర్యులు హెచ్.డి.కుమారస్వామిని కలిసి భారతదేశంలో ఉన్న ఎచ్ఎంటి మెషిన్ టూల్స్ పునరుద్ధరించాలని మరియు ఉద్యోగుల బకాయలు చెల్లించాలాని కోరుతూ వినతిపత్రం అందజేయడం జరిగింది..

అనంతరం కేంద్రమంత్రివర్యులు హెచ్.డి. కుమారస్వామి సానుకూలంగా స్పందించి వచ్చే మూడు నెలల్లో దేశంలో ఉన్న ఎచ్ఎంటి మెషిన్ టూల్స్ పునరుద్ధరణ మరియు ఉద్యోగుల బకాయలు చెల్లింపునకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు..

ఈ కార్యక్రమంలో సెక్రటరీ కమ్రాన్ రిజ్వి, జాయింట్ సెక్రటరీ ప్రేమ్ చాంద్ మౌర్య, డైరెక్టర్ నరేష్ కుమార్ బ్రెష్టస్, హైదరాబాద్ ఎచ్ఎంటి జనరల్ సెక్రటరీ శ్రీనివాస్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ పి. శ్రీశైలం, ప్రెసిడెంట్ శ్రీనివాస్ నాయక్, వైస్ ప్రెసిడెంట్ ఏన్ చారీ, జాయింట్ సెక్రటరీ ఎ. శ్రీహరి, పింజొర్ ఎచ్ఎంటి సంజయ్ కుమార్, జనరల్ సెక్రటరీ విశాల్ శర్మ, అజ్మీర్ ఎచ్ఎంటి ప్రెసిడెంట్ కైలాష్ సింగ్‌ పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments