Wednesday, January 14, 2026
No menu items!
Advertisement
హోమ్అవీ-ఇవీ‘Dogesh Babu’ పేరుతో కుక్కకు నివాస ధృవపత్ర దరఖాస్తు

‘Dogesh Babu’ పేరుతో కుక్కకు నివాస ధృవపత్ర దరఖాస్తు

– విచారణ ఆదేశించిన జిల్లా కలెక్టర్

అక్షరగళం, బీహార్ : ప్రభుత్వ ధృవపత్రాల జారీ వ్యవస్థపై బీహార్ లో వరుసగా విచిత్ర ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఇటీవల Dog Babu అనే శునకానికి అధికారిక నివాస ధృవపత్రం జారీ కావడం పెద్ద వివాదానికి దారితీసిన విషయం తెలిసిందే. ఇదే తరహాలో ఇప్పుడు నవాడా జిల్లాలో మరో వినూత్న సంఘటన చోటుచేసుకుంది.

⭐ 🐶 కుక్క ఫోటోతో ‘Dogesh Babu’ పేరున దరఖాస్తు

నవాడా జిల్లా సిర్‌డాలా RTPS కేంద్రంలో “Dogesh Babu” అనే పేరుతో నివాస ధృవపత్రం కోసం దరఖాస్తు సమర్పించబడింది.
ఆ దరఖాస్తులో— కుక్క కు నివాస పత్రం కోసం కుక్క పేరు Dogesh Babu, మగ కుక్కగా,
ఫాదర్ mother name name Dogesh’s Papa, Dogesh’s Mummy/Mami గా పేర్కొంటూ సునకం ఫోటోను కూడా జత చేశారు. దరఖాస్తు పూర్తిగా చెల్లుబాటు అయ్యే పత్రాల రూపంలో ఉండటంతో, మొదటిది ఇది నిజమని అధికారులు భావించినట్లు సమాచారం.

⭐ నకిలీ దరఖాస్తుగా నిర్ధారణ – FIR నమోదు
QR కోడ్, అప్లికేషన్‌ ID వంటి వివరాలు పరిశీలించిన తర్వాత ఇది ఫోర్జరీ ద్వారా సమర్పించిన ఫేక్ దరఖాస్తు అని జిల్లా అధికారులు గుర్తించారు.
దీంతో జిల్లా మేజిస్ట్రేట్ రవి ప్రకాష్ ఆదేశాల మేరకు స్థానిక పోలీస్ స్టేషన్‌లో FIR నమోదు చేసి విచారణ ప్రారంభించారు.

⭐ వ్యవస్థలో లోపాలపై ప్రశ్నలు
ఇటీవలి రోజుల్లో శునకాల పేరుతో వరుసగా వచ్చే ఇలాంటి దరఖాస్తుల వల్ల బీహార్ ప్రభుత్వ డిజిటల్‌ సర్వీస్‌లలో ఉన్న లోపాలు మళ్లీ చర్చకు వచ్చాయి. నివాస, కుల ధృవపత్రాల వంటి ముఖ్య సేవల్లో సరైన ధృవీకరణ సాధనాలు లేకపోవడం వల్ల ఎవరైనా అబద్ధపు, వ్యంగ్య దరఖాస్తులు సమర్పించగలిగే పరిస్థితి ఏర్పడిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

⭐ సోషల్ మీడియాలో వైరల్
ఈ దరఖాస్తు వివరాలు బయటపడిన వెంటనే సోషల్ మీడియాలో మీమ్స్ వరదలా వచ్చాయి. “ఇకపైనా ధృవపత్రాలు మనుషులకు కంటే కుక్కలకే బాగా ఇస్తారేమో!” అంటూ నెటిజన్లు వ్యంగ్యంగా స్పందిస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments