ఘనంగా సోనియా గాంధీ పుట్టిన రోజు వేడుకలు
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 125 డివిజన్ గాజుల రామారం బేకరీ గడ్డ బస్తి ప్రెసిడెంట్ గఫర్, రహీం, ఖాజాల ఆధ్వర్యంలో తెలంగాణా రాష్ట్ర ప్రధాత సోనియా గాంధీజన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సీనియర్ కాంగ్రెస్ నాయకుడు సిద్ధనోళ్ల సంజీవ రెడ్డి కేక్ కట్ చేసి సోనియా గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ప్రత్యేక తెలంగాణ కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూసిన ప్రజలకు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇస్తున్నట్టు సోనియా గాంధీ ప్రకటించి.. తెలంగాణ ప్రధాతగా చరిత్రలో నిలిచిపోయారని అన్నారు. ఈ విషయాన్ని ప్రతి తెలంగాణ పౌరుడు మారిచిపోరాదని సంజీవ రెడ్డి గుర్తు చేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ వార్డ్ మెంబర్ శ్రీనివాస రావు, శ్యామ్, విజయ్, యూసుఫ్, ఖయ్యూం, పర్వేజ్, మోయిన్, అహ్మద్, మహమ్మద్ లతో పాటు స్థానికులు పాల్గొన్నారు.

