Wednesday, January 14, 2026
No menu items!
Advertisement
హోమ్జిహెచ్​​ఎంసిశివారు ప్రాంతాల్లో ఇళ్లు క‌ట్టుకోవాల‌నుకుంటున్నారా..? అయితే మీకు జీహెచ్ఎంసీ(GHMC) గుడ్ న్యూస్‌ చెబుతోంది…

శివారు ప్రాంతాల్లో ఇళ్లు క‌ట్టుకోవాల‌నుకుంటున్నారా..? అయితే మీకు జీహెచ్ఎంసీ(GHMC) గుడ్ న్యూస్‌ చెబుతోంది…

HYD GHMC
శివారు ప్రాంతాల్లో ఇళ్లు క‌ట్టుకోవాల‌నుకుంటున్నారా..?
అయితే మీకు జీహెచ్ఎంసీ గుడ్ న్యూస్‌ చెబుతోంది…

*శివారు ప్రాంతాల్లో నివాస నిర్మాణాల‌పై జీహెచ్ఎంసీ స్ట్రాంగ్ డెసిష‌న్
*శివారు ప్రాంతాలకు శుభవార్త
*GHMCలో నిర్మాణ అనుమతుల ప్రక్రియ పునరుద్ధరణ

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ శివారు ప్రాంతాల్లో నిర్మాణ అనుమతుల ప్రక్రియను పునరుద్ధరించింది. ‘బిల్డ్‌నౌ’ సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేసి… డిసెంబ‌ర్ 7 నుంచి దరఖాస్తులను స్వీకరించడం మొద‌లు పెట్టింది. ప్రస్తుతం G+2 వరకు అనుమతులు ఇవ్వనుండగా.. మరిన్ని అంతస్తుల నిర్మాణాలకు అనుమ‌తుల కోసం సాఫ్ట్‌వేర్ మార్పులు జరుగుతున్నాయి.

ప్రస్తుతానికి G+2 (గ్రౌండ్ ప్లస్ రెండు అంతస్తులు) వరకు ఉన్న భవనాలకు మాత్రమే అనుమతులు ఇవ్వనున్నారు. ఇన్‌స్టంట్‌ రిజిస్ట్రేషన్‌లో 75 చదరపు గజాల్లోపు భూములకు స్టిల్ట్‌+2 లేదా జి+1 అనుమతి మంజూరు చేస్తారు. ఇన్‌స్టంట్‌ అప్రూవల్‌ కింద 75 నుంచి 1000 చదరపు గజాల్లోపు స్థలాల్లో స్టిల్ట్‌+5 నిర్మాణానికి అనుమతి ఇవ్వనున్నారు. అంతకుమించి ఎక్కువ అంతస్తుల నిర్మాణాలకు సంబంధించిన సాఫ్ట్‌వేర్ మార్పులు ఇంకా జరుగుతున్నాయి కాబట్టి, వాటి అనుమతులు మంజూరు కావడానికి మరికొన్ని రోజులు వేచి చూడాల్సి ఉంటుంది. బహుళ అంతస్తులు, ఆకాశహర్మ్యాల కోసం పార్కింగ్ స్థలం, ఖాళీ స్థలం వంటి నిబంధనలలో మార్పులు ఉంటాయి. శివారు సర్కిళ్లలో జీహెచ్ఎంసీ నిబంధనల ప్రకారం అనుమతులు జారీ అయ్యేలా సాఫ్ట్‌వేర్‌ను సవరించాక ఆయా దరఖాస్తులను పునరుద్ధరిస్తారు.

రుసుము చెల్లింపుతో ముడిపడిన అన్ని రకాల పౌర సేవలు ప్రస్తుతం నిలిచిపోయాయి. వాటన్నింటినీ సోమవారం నుండి పునరుద్ధరించి, ప్రజలకు అసౌకర్యాన్ని తొలగిస్తామని పరిపాలన విభాగం ప్రకటించింది. విలీనమైన మున్సిపాలిటీల పరిధిలో గతంలో ఆయా మున్సిపల్ కమిషనర్ ఖాతాలకు చేరే భవన నిర్మాణ రుసుములు, జనన/మరణ ధ్రువపత్రాల రుసుములు, ఆస్తిపన్ను, ఎస్టేట్స్, ఇతర రుసుములన్నీ ఇకపై జీహెచ్ఎంసీ కమిషనర్ ఖాతాకు చేరేలా చర్యలు చేపట్టారు.

హైదరాబాద్ శివారు ప్రాంతాల్లోని ప్రజలకు, నిర్మాణదారులకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) తీపి కబురు అందించింది. జీహెచ్ఎంసీలో విలీనమైన మున్సిపాలిటీలు,కార్పొరేషన్ల పరిధిలో నిలిచిపోయిన నిర్మాణ అనుమతుల ప్రక్రియను పునరుద్ధరించేందుకు బల్దియా సన్నాహాలు చేసింది. ఇప్పటి వరకు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లుగా ఉన్న పట్టణ స్థానిక సంస్థలను జీహెచ్ఎంసీలో భాగం చేస్తూ ‘బిల్డ్‌నౌ’ సాఫ్ట్‌వేర్‌లో అవసరమైన మార్పులు చేశారు.

హెచ్ఎండీఏ పరిధిలో ప్రస్తుతం వందలాది ఆకాశహర్మ్యాల భవనాల అనుమతి దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయి. హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ నిబంధనలకు మధ్య చాలా వ్యత్యాసం ఉన్నందున గ్రేటర్ విలీనం నేపథ్యంలో ఈ దరఖాస్తులను ఏ నిబంధనల ప్రకారం ఆమోదించాలనే అంశంపై అధికారులు ప్రస్తుతం తర్జనభర్జన పడుతున్నారు. ఈ విషయంలో స్పష్టత రావాల్సి ఉంది.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments