Monday, December 23, 2024
spot_img
HomeHEALTHSkin Care:చర్మాన్ని అందంగా ఎలా ఉంచుకోవాలి..!

Skin Care:చర్మాన్ని అందంగా ఎలా ఉంచుకోవాలి..!

Skin Care:సాధారణంగా చర్మాన్ని అందంగా ఉంచుకోవడంలో చేసే తప్పులు:

Skin Care:చర్మాన్ని అందంగా  ఉంచుకోవడంలో కొన్ని సాధారణ తప్పులు చేస్తుంటాం.  అవి ఏంటో చూద్దాం:

మన చర్మానికి సరిపోయే ప్రోడక్ట్ వాడకపోవడం: ప్రతి ఒక్కరి  చర్మం వేరుగా ఉంటుంది, అందుకే ఎవరి చర్మానికి సరిపోయే ప్రొడక్ట్స్ వాళ్ళు మాత్రమే ఉపయోగించాలి.అంతేకాని మార్కెట్లో దొరికే అన్ని ప్రొడక్ట్స్ వాడకూడదు.

తగినంత వాటర్ త్రాగకపోవడం: తగినంత నీరు తాగడం ద్వారా చర్మం ఆరోగ్యంగా,డీహైడ్రేషన్  కాకుండా ఉంటుంది.డీహైడ్రేషన్ వాళ్ళ చర్మం ముదాలు పడడమే కాకుండా రాఫ్గా మారుస్తుంది.

ఎక్కువగా స్క్రబ్ చేయడం: చర్మాన్ని ఎక్కువగా స్క్రబ్ చేయడం వల్ల అది గరుకుగా  మారుతుంది. రోజుకు ఒకసారి స్క్రబ్ చేస్తే సరిపోతుంది.

సన్‌స్క్రీన్ వాడకపోవడం: ఎండలో వెళ్ళినప్పుడు సన్‌స్క్రీన్ తప్పకుండ వేసుకోవాలి దీనివల్ల చర్మం ప్రకాశవంతంగా ఉంటుంది.

కొత్త ఉత్పత్తులను తక్షణమే ప్రయత్నించడం: ఒక ఉత్పత్తిని ఉపయోగించడానికి ముందు, కొన్ని రోజుల పాటు పరీక్షించడం మంచిది. ఈ విధంగా చర్మానికి దుష్ప్రభావాలు ఉండవు.

ఒక్కో ఉత్పత్తి పట్ల అధిక అవిశ్వాసం: ఒకే ఉత్పత్తి పై ఎక్కువగా ఆధారపడడం, నకిలీ ఉత్పత్తులను ఉపయోగించడం వల్ల సానుకూల ఫలితాలు రావు.

సాధారణమైన చర్మ నిర్వహణను పక్కన పెట్టడం: ప్రతిరోజు సరైన శుభ్రత, టోనింగ్ మరియు మాయిశ్చరైజింగ్ అనేది ముఖ్యమైనది.

చర్మ సంరక్షణ పద్దతులు:

ప్రతిరోజూ నీరు తాగండి: దాదాపు 2-3 లీటర్లు నీరు తాగండి.

సన్‌స్క్రీన్ తప్పనిసరి: కనీసం SPF 30 ఉన్న సన్‌స్క్రీన్ వాడండి.

చర్మం ప్రకారం ఉత్పత్తులు ఎంచుకోండి: చర్మ పరిస్థితి మరియు స్కిన్ టైపు  ఆధారంగా సరైన ఉత్పత్తులను ఉపయోగించండి.

వయస్సుకు అనుగుణంగా ఉత్పత్తులు: వయస్సు పెరిగేకొద్దీ చర్మం మారుతుంది, అందువల్ల అనువైన ఉత్పత్తులు మార్చాలి.

ఈ సూచనలను పాటించడం ద్వారా మీరు మీ చర్మాన్ని ఆరోగ్యంగా మరియు ప్రకాశవంతంగా ఉంచవచ్చు.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments