Monday, December 23, 2024
spot_img
Homeఆంధ్రప్రదేశ్Vijayawada:పసిపిల్ల ప్రాణాలు తీసిన ఆసిడ్ బాటిల్

Vijayawada:పసిపిల్ల ప్రాణాలు తీసిన ఆసిడ్ బాటిల్

Vijayawada:విజ‌య‌వాడ‌లో విషాదం చోటు చేసుకుంది. నీళ్ల‌నుకుని యాసిడ్ తాగి ఒక  చిన్నారి మృతి చెందింది. దీంతో త‌ల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. శ‌నివారం జ‌రిగిన ఈ సంఘటన ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. విజ‌య‌వాడ ప‌ట‌మ‌ట పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేపట్టారు.

Vijayawada:విజ‌య‌వాడ‌లోని అశోక్‌న‌గ‌ర్‌లో విషాదం చోటు చేసుకుంది. కృష్ణా జిల్లా మ‌చిలీప‌ట్నం టెంపుల్ కాల‌నీకి చెంద‌ని మ‌హ్మ‌ద్ అబ్బాస్ క్రేన్ హెల్ప‌ర్‌గా ప‌ని చేస్తున్నాడు. అత‌నికి విజ‌య‌వాడ అశోక్ న‌గ‌ర్‌కు చెందిన మ‌హిళ‌తో నాలుగేళ్ల కింద‌ట వివాహం అయింది. వీరికి అయేషా, ఆఫియా (18 నెల‌లు) ఇద్ద‌రు పిల్ల‌లు ఉన్నారు. ఈ నెల 19న అబ్బాస్ త‌న భార్య‌, ఇద్ద‌రు పిల్ల‌ల‌తో క‌లిసి మ‌చీలిప‌ట్నం నుంచి అశోక్ న‌గ‌ర్‌లోని  తన అత్తారింటికి వ‌చ్చాడు.

విజ‌య‌వాడ‌లోని అశోక్‌న‌గ‌ర్‌లో విషాదం చోటు చేసుకుంది. కృష్ణా జిల్లా మ‌చిలీప‌ట్నం టెంపుల్ కాల‌నీకి చెంద‌ని మ‌హ్మ‌ద్ అబ్బాస్ క్రేన్ హెల్ప‌ర్‌గా ప‌ని చేస్తున్నాడు. అత‌నికి విజ‌య‌వాడ అశోక్ న‌గ‌ర్‌కు చెందిన మ‌హిళ‌తో నాలుగేళ్ల కింద‌ట వివాహం అయింది. వీరికి అయేషా, ఆఫియా (18 నెల‌లు) ఇద్ద‌రు పిల్ల‌లు ఉన్నారు. ఈ నెల 19న అబ్బాస్ త‌న భార్య‌, ఇద్ద‌రు పిల్ల‌ల‌తో క‌లిసి మ‌చీలిప‌ట్నం నుంచి అశోక్ న‌గ‌ర్‌లోని  తన అత్తారింటికి వ‌చ్చాడు.

మధ్యాహ్నం సమయంలో ఆఫియా ఆడుకుంటూ స్నానాల గదిలోకి వెళ్ళింది. అక్కడ ఉన్న ఆసిడ్ బాటిల్ని చూసి వాటర్ అనుకోని తాగింది. తరవాత కడుపులో వికారంగా ఉండడంతో వాంతులు చేసుకుంది. అది గమనించిన తన తండ్రి ప్రభుత్వ హాస్పిటల్కి తీసుకోని వెళ్లగా శికిత్స తీసుకుంటూ మరణించింది.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments