Siddipet Crime:జల్సాలకు అలవాటుపడిన ఓ వ్యక్తి సులభంగా డబ్బు సంపాదించడానికి మార్గంగా బంగారం దొంగతనాన్ని ఎంచుకున్నాడు.కస్టమర్ లాగా షాపులోకి వెళ్లి బంగారం కొంటున్నట్లు నటించి బంగారం చైన్స్ ని తీసుకోని పారిపోయాడు.దొంగతనం చేసిన వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు.
Siddipet Crime:ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం జిల్లా మద్దిలపాలెంకు చెందిన వేపంచ షణ్ముఖ రెడ్డి (24) పీజీ చదువుతూ హైదరాబాద్‌లో నివసిస్తున్నాడు. ఈ క్రమంలో జల్సాలకు అలవాటు పడ్డాడు. జల్సా చేసేందుకు డబ్బులు లేకపోవడంతో బంగారం చోరీ చేసి ఇతరులకు విక్రయించి డబ్బులు సంపాదించాలని నిర్ణయించుకున్నాడు.తన స్నేహితుడి వద్ద మోటార్ బైక్ తీసుకోని, హైద్రాబాద్లో దొంగతనం చేస్తే పట్టుపడతానని అదే బైక్సి మీద సిద్ధిపేట వెళ్ళాడు.
సిద్దిపేట లాల్ కమాన్ దగ్గరలో ఉన్న నయీం మియా బంగారం షాపులోకి కస్టమర్ లాగా వెళ్లి బంగారు చైన్లు చూపించమని అడిగాడు. అక్కడ షాపు నిర్వాహకులు ఐదు బంగారు చైన్లు ఉన్న ట్రే తీసుకొని వచ్చి అతడికి చూపిస్తున్నాడు. చైన్లు చూస్తున్నట్టు నటించిన షణ్ముఖ్ వారి కళ్ళు కప్పి ట్రే తో సహా మొత్తం బంగారు చైన్లు తీసుకోని పారిపోయాడు.
తర్వాత ఆ బంగారం చైన్స్ తీసుకోని బైక్ మీద హైదరాబాద్ వైపుగా వెళ్తున్నాడు.సగం దూరం వచ్చాక టోల్గెట్ దగ్గర ఉన్న సిబ్బందిని చూసి పోలీసులు అనుకోని బైక్ ని అతి వేగంగా నడిపి కిందపడ్డాడు.అది గమనించిన అక్కడి సిబ్బంది అతడికి వైద్యం చేసి పంపించారు.తర్వాత హైదరాబాద్ వచ్చిన అతడు రక్తం అంటిన తన షర్ట్ మార్చుకొని తాను ఉంటున్న ప్లేస్కి వెళ్ళాడు.
దొంగలనచిన బంగారం హైద్రాబాద్లో అమ్మితే అనుమానం వస్తుందని కరీంనగర్ వెళ్లాలనుకున్నాడు.మల్లి తన స్నేహితుడి బండి తీసుకోని కరీంనగర్ వైపుగా వెళ్తుంటే టూ టౌన్ ఇన్స్పెక్టర్ ఉపేందర్, మరియు సిబ్బంది రంగీలా దాబా చౌరస్తా వద్ద వాహనాలు తనిఖీ చేస్తున్న పోలీసులను చూసి పారిపోవడానికి ప్రయత్నించాడు.అనుమానం వచ్చిన పోలీసులు పట్టుకొని విచారించగా విషయం బయట పడింది.
అతని వద్ద నుండి 8 తులాల 5 బంగారు చైన్లు, బైక్, రక్తం మరకలున్న షర్ట్ ను పోలీసులు స్వాధీనంచేసుకున్నారు. నిందితున్ని అరెస్టు చేసి జ్యుడిషియల్ రిమాండ్ కు తరిలించినట్లు టూ టౌన్ ఇన్స్పెక్టర్ ఉపేందర్ తెలిపాడు.ఈ కేసులో నిందితున్ని చాకచక్యంగా పట్టుకున్న టూ టౌన్ ఇన్స్పెక్టర్ ఉపేందర్, మరియు సిబ్బందిని పోలీస్ కమిషనర్ అనురాధ అభినందించారు.