Bhadradri:రాహుల్‌పై వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ నిరసనలు చేసారు.
Bhadradri:NSUI ఆధ్వర్యంలో బీజేపీ నాయకుల దిష్టిబొమ్మ దహనం
Bhadradri:కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభలో విపక్ష నేత రాహుల్ గాంధీపై కేంద్ర మంత్రి రవ్‌నీత్ సింగ్ బిట్టూ చేసిన వ్యాఖ్యలపై NSUI జిల్లా అధ్యక్షులు అజ్మీరా సురేష్ నాయక్ ఆధ్వర్యంలో యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు భగ్గుమన్నారు.
భద్రాద్రి జిల్లా కేంద్రం కొత్తగూడెం బస్టాండ్ అమరవీరుల స్తూపం వద్ద యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు బుధవారం ఆందోళన చేపట్టారు. బీజేపీ నేతలు రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఇది సరైన పద్దతి కాదని తర్వీందర్ సింగ్ మార్వా, రవ్ నీత్ బిట్టు పై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతు దిష్టిబొమ్మ దహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతు BJP ఢిల్లీ మాజీ ఎమ్మెల్యే తర్విందర్ సింగ్ మార్వా, కేంద్ర మంత్రి రవ్‌నీత్ బిట్టు చేసిన వ్యాఖ్యలు సమంజసం కాదని, రాహుల్ గాంధీ ఇలాంటివి మానుకోక పొతే రాబోయే కాలంలో మీ అమ్మమ్మకి పట్టిన గతి మీకు కూడా వస్తుంది (రాహుల్ గాంధీ బాజ్ ఆజా నహీ తో ఆనే వాలే టైమ్ మే తేరా భీ వోహీ హాల్ హోగా జో తేరీ దాదీ కా హాల్ హువా), ఈ వ్యాఖ్యలు నాయకుడిని అవమానించడమే కాక ప్రజాస్వామ్యాన్ని గౌరవం విలువలపై ప్రత్యక్ష దాడి అని, రాహుల్ గాంధీ పై రవ్‌నీత్ బిట్టు బెదిరింపు వ్యాఖ్యలపై పిఎం నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్ షా స్పందించి వారిపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.