Keesara:శ్రీశ్రీశ్రీ వేణుగోపాల స్వామి ఆలయ ప్రాంగణంలో ప్రధాని నరేంద్ర మోడీ 74వ జన్మదిన వేడుకలు
Keesara:ఆలయ చైర్మన్ కు రూ.21,000/- వేల విరాళం అందజేసిన చైర్మన్ చంద్రారెడ్డి
భారత ప్రధానమంత్రి దామోదర నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలు పురస్కరించుకొని నాగారం పురపాలక సంఘం పరిధిలోని గోపికృష్ణ కాలనీ శ్రీశ్రీశ్రీ వేణుగోపాల స్వామి ఆలయ ప్రాంగణంలో చైర్మన్ కౌకుట్ల చంద్రారెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం ప్రధాని నరేంద్ర మోడీ 74వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ…ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా గోశాలకు ట్రక్ పశుగ్రాసం (వరి గడ్డి) కోసం ఆలయ చైర్మన్ జానకి రామ్ కు రూ.21,000/వేల రూపాయలు విరాళం అందజేయడం జరిగిందని తెలిపారు.దేశం తన కుటుంబమని భావించి నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలు నిర్వహించు కోవడం ఆనందంగా ఉందని ప్రతి ఒక్కరూ గోవును రక్షించాలి అని కోరారు.
నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశం అభివృద్ధి పథంలో దూసుకుపోతుందన్నారు. ప్రపంచంలోని అన్ని దేశాలు భారత వైపు చూస్తున్నాయని,మోడీ కఠోర శ్రమతోనే సాధ్యమైందన్నారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ బిజ్జ శ్రీనివాస్ గౌడ్,బిజెపి ప్రధాన కార్యదర్శి ఆర్.రవీందర్ రెడ్డి,టి.సూర్య శేఖర్ రెడ్డి,రాజశేఖర్ రెడ్డి,నాగారం పట్టణ బిజెపి కార్యదర్శి సీనియర్ నాయకులు జూపల్లి నరేష్,పిసిరి పవన్ కుమార్,ఆలయ కమిటీ సభ్యులు బిజెపి కార్యకర్తలు కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.