Balapur Laddu:బాలాపూర్ గణేష్ లడ్డూ రికార్డు ధర పలికింది.
Balapur Laddu History: బాలాపూర్ లడ్డూ హైదరాబాద్‌లో వినాయక చవితి ఉత్సవాల్లో అత్యంత ప్రాముఖ్యతను పొందిన అంశం. 1994లో ప్రారంభమైన ఈ లడ్డూ వేలం వేయడం, ప్రతి ఏడాది వినాయక చవితి సందర్భంగా ఘనంగా జరుగుతుంది. బాలాపూర్ గ్రామంలో ఉన్న గణేష్ విగ్రహం వద్ద అర్చనలు ముగిశాక, పూజారులు పూజించిన లడ్డూను వేలం ద్వారా వేలకొద్దీ భక్తులకు విక్రయిస్తారు.
ప్రారంభంలో కేవలం కొన్ని వేల రూపాయలకే అమ్ముడైన ఈ లడ్డూ, ఇప్పుడు కోట్ల రూపాయలకు చేరుకుంది. భక్తుల విశ్వాసం ప్రకారం, ఈ లడ్డూను పొందినవారు సిరిసంపదలు, శ్రేయస్సును పొందుతారని నమ్ముతారు. ప్రత్యేకంగా రైతులు ఈ లడ్డూను కొనుగోలు చేసి, తమ పొలాల్లో చల్లడం వలన పంటలు పుష్కలంగా పండుతాయని విశ్వసిస్తారు.
బాలాపూర్ లడ్డూ వేలం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది, మరియు ఇది గణేశ్ ఉత్సవాల్లోని ముఖ్య ఆకర్షణగా నిలుస్తుంది.
గతేడాది కంటే ఎక్కువ ధర పలికిన బాలాపూర్ గణేష్:
గతేడాది బాలాపూర్ గణేష్ లడ్డు ధర 27 లక్షలు పలకగా ఈ ఏడాది మాత్రం రికార్డు స్థాయిలో ధర పలికింది. అయితే ఈ సారి 1116 రూపాయిలతో వేలంపాట మొదలయింది.అలా పోటా పోటీగా సాగిన వేలంపాటలో 30 లక్షల ఒక వెయ్యి రూపాయిలకు వేలంపాట ముగిసింది. అలా గతేడాది కంటే 3 లక్షల 1000 రూపాయిలు అధికంగా ధర పలికింది.
బాలాపూర్ లడ్డు దక్కించుకున్న కొలను శంకర్ రెడ్డి:
ఈ సారి 1116 రూపాయిలతో వేలంపాట మొదలయింది.అలా పోటా పోటీగా సాగిన వేలంపాటలో 30 లక్షల ఒక వెయ్యి రూపాయిలకు వేలంపాట ముగిసింది.ఈ సారి 30 లక్షల ఒక వెయ్యి రూపాయిలకు లడ్డును కొలను శంకర్ రెడ్డి. అయితే ఎక్కువ సార్లు బాలాపూర్ లడ్డూను దక్కించుకుంది మాత్రం ఈ కొలను ఫామిలీయే.
లడ్డూ రికార్డు బ్రేక్:
నిన్న జరిగిన మై హోమ్ అపార్ట్మెంట్స్ లో జరిగిన లడ్డు వేలం 29 లక్షలకు పలకగా ఆ రికార్డును బాలాపూర్ గణేష్ దాన్ని బ్రేక్ చేసింది. ఏకంగా 30 లక్షలు పలికి తన రికార్డు తానే బ్రేక్ చేసుకుంది. బాలాపూర్ రికార్డు ఎవరు బ్రేక్ చేయలేరని మళ్ళి ప్రూవ్ చేసుకుంది.