చిన్నారిని చిదిమేసిన స్కూల్ బస్
Hyderabad:బస్ డ్రైవర్ నిర్లక్ష్యం ఐదేళ్ల చిన్నారి ప్రాణాన్ని బలితీసుకుంది. తాను చదువుకునే స్కూల్ బస్సే తన పాలిట మృత్యు పాశమైంది. వివరాల్లోకి వెళితే మల్లంపేటలోని ఓక్లా స్కూల్ లో ఫస్ట్ క్లాస్ చదువుతున్న మహన్విత రోజులాగే స్కూల్ కు రెడి అయి బస్ లో స్కూల్ కు వచ్చింది. తోటి పిల్లలతో పాటే బస్సు దిగింది. కానీ మహిన్విత చివరగా బస్సు దిగింది. క్లాస్ లోకి వెళ్లడానికి నడుచుకుంటూ వెళ్తుంది. కానీ బస్ డ్రైవర్ పాపను చూసుకోకుండా నిర్లక్ష్యంగా బస్సును ముందుకు నడిపాడు. చిన్నారి మిద నుంచి బస్సు దూసుకెళ్లింది. దీంతో పాప అక్కడిక్కడే చనిపోయింది. విగతజీవిగా పడివున్న చిన్నారిని చూసిన తల్లిదండ్రుల ఏడుపు అక్కడున్నవారిని కంటతడి పెట్టించింది….