Monday, December 23, 2024
spot_img
HomeBreakingచిన్న కథ కాదు గ్లింప్స్‌ రిలీజ్‌

చిన్న కథ కాదు గ్లింప్స్‌ రిలీజ్‌

అక్షరగళం,వెబ్ డెస్క్​: థామస్‌, ప్రియదర్శి, విశ్వదేవ్‌, గౌతమి, భాగ్యరాజ్‌ లీడ్‌ రోల్స్‌లో నటించిన న్యూ ఏజ్‌ క్లీన్‌ ఎంటర్‌టైనర్‌  ’35 ` చిన్న కథ కాదు’.  రానా దగ్గుబాటి సమర్పణలో సృజన్‌ యరబోలు, సిద్దార్థ్‌ రాళ్లపల్లినిర్మిస్తున్న ఈ చిత్రానికి నంద కిషోర్‌ ఈమాని దర్శకుడు. తాజాగా ఈ సినిమా నుంచి మొండి గురువు ఓ. చాణక్య వర్మకి సంబంధించిన 35 సెకెన్ల గ్లింప్స్‌ రిలీజ్‌ చేశారు మేకర్స్‌. ఈ సినిమాలో నటుడు ప్రియదర్శి ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. గణిత ఉపాధ్యాయుడి పాత్రలో దర్శి కనిపిస్తున్న వీడియో ఆకట్టుకుంటోంది. ఆయన మొండితనం, క్రమ శిక్షణలో చూపెట్టే నేర్పరితనం ఈ గ్లింప్స్‌లో స్పెషల్‌ అట్రాక్షన్‌ గా నిలిచాయి.తిరుపతి నేపథ్యంలో జరిగే ఈ కథలో నివేదా థామస్‌ తల్లి పాత్ర పోషించారు. పరీక్షల్లో కనీసం పాస్‌ మార్కులు రానందుకు తండ్రి మందలించగా..కొడుకు అలిగి ఇంటి నుంచి వెళ్లిపోవడం.. అతడి కోసం తల్లి ఆరాటపడడం తదితర అంశాలతో ఈ సినిమా రూపొందింది. ఇదివరకే ఈ సినిమా నుంచి రిలీజైన టీజర్‌ ప్రేక్షకుల హృదయాలను హత్తుకునేలా చేసింది. వివేక్‌ సాగర్‌ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ఆగస్ట్‌ 15న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments