Monday, December 23, 2024
spot_img
Homeఆంధ్రప్రదేశ్టీడీఆర్‌ బాండ్లలో కుంభకోణం

టీడీఆర్‌ బాండ్లలో కుంభకోణం

తణుకులోనే రూ. 700 కోట్ల అవినీతి
రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి పి.నారాయణ
టీడీఆర్‌ బాండ్లకు సంబంధించి ఒక్క తణుకులోనే రూ.700 కోట్ల మేర అవినీతి జరిగిందని రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి పి.నారాయణ అన్నారు. రాష్ట్రంలో తణుకు, విశాఖపట్నం, తిరుపతి, గుంటూరులో టీడీఆర్‌ బాండ్ల కుంభకోణం జరిగిందన్నారు. ‘టౌన్‌ ప్లానింగ్‌ విషయంలో 2014`19 మధ్య కాలంలో ఒక్క ఫిర్యాదు కూడా రాలేదు. కానీ, గత ప్రభుత్వ హయాంలో టీడీఆర్‌ బాండ్ల విషయంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది. తణుకులో 29 బాండ్లు ఇచ్చారు.. వీటిలో అన్నీ అవకతవకలే జరిగాయి. గజాల కింద లెక్కలు వేయాల్సి ఉండగా.. ఎకరాల చొప్పున లెక్కలేసి బాండ్లలో అవకతవకలకు పాల్పడ్డారు. 1:200 నిష్పత్తిలో ఇవ్వాల్సింది 1:400 నిష్పత్తిలో ఇచ్చారు. విలువలూ పెంచేశారు. ఇదో పెద్ద కుంభకోణం .. దీని వల్ల ముగ్గురు సస్పెండ్‌ అయ్యారు. టీడీఆర్‌ బాండ్ల విషయంలో అవినీతి ఇలా కూడా చేస్తారా? అని ఆశ్చర్యం కలిగే రీతిలో స్కామ్‌ జరిగింది. రూ.వందల కోట్ల అవినీతి జరిగింది. గుంటూరులోనూ ఇదే తరహాలో వాల్యూయేషన్‌లో తేడాలు చూపించారు. 9 వేల గజాలు అయితే 20 వేల గజాలకు లెక్కలేసి టీడీఆర్‌ బాండ్లలో చూపించారు. ఈ స్కామ్‌ విషయంలో సీఎం చంద్రబాబుతో సంప్రదించి నిర్ణయం తీసుకుంటాం. నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి పనులూ చేయొద్దని అధికారులకు స్పష్టంగా చెప్పాం. ఏ స్థాయి నాయకుడైనా సరే నిబంధనలకు విరుద్ధంగా చేయమంటే.. చేయొద్దని సూచించాం‘ అని మంత్రి నారాయణ వెల్లడిరచారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments