Monday, December 23, 2024
spot_img
Homeతెలంగాణఅంగన్వాడి కేంద్రంలో చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాసం

అంగన్వాడి కేంద్రంలో చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాసం

అమనగల్లు, జూలై 23 (అక్షర గళం) ;
అమనగల్లు పట్టణ కేంద్రంలో అంగన్వాడి కేంద్రంలో అమ్మ మాట…అంగన్వాడి బాట కార్యక్రమంలో భాగంగా మంగళవారం చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాసాన్ని నిర్వహించారు. తల్లుల సమక్షంలో సరస్వతి దేవి చిత్రపటానికి పూజలు నిర్వహించి చిన్నారులతో అక్షరాభ్యాసం చేయించారు. ఈ సందర్భంగా ఐసిడిఎస్ సూపర్వై సర్ పార్వతి మాట్లాడుతూ.. అంగన్వాడీలో ఎలాంటి ఒత్తిడి లేకుండా చిన్నారులకు ఆటపాటలతో కూడిన విద్యాబోధన అందించడం జరుగుతుందన్నారు.

ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం పౌష్టికాహారం అందిస్తున్నామని, అంగన్వాడి కేంద్రాలను చిన్నారుల తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. 3 సంవత్సరాల నుండి 5 సంవత్సరాలలోపు పిల్లలను తప్పకుండా అంగన్వాడి కేంద్రాలలో చేర్చాలని చిన్నారుల తల్లులకు సూచించారు. వారం రోజుల నుండి విద్యార్థులకు నేర్పిన విద్య బోధనలు తల్లిదండ్రుల సమక్షంలో సమీక్షించారు. అనంతరం అక్షరాభ్యాసం చేయించిన చిన్నారులతో అక్షరాలను దిద్దించారు. ఈ కార్యక్రమంలో సూపర్ వైసర్స్ శబరి, సరళ, తిరుమల, పద్మ, కవిత, బాలమణి అంగన్వాడి టీచర్లు సంధ్య, రాజ్యలక్ష్మి, రజిత, నాగమణి, లక్ష్మి, స్వరూప మరియు తల్లులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments