– ఢిల్లీలో ఉన్న పెద్దల అనుకూలత కోసం భూముల అమ్మకాల డ్రామా
– సీఎం చుట్టూ రియల్ ఎస్టేట్ మాఫియా కార్యకలాపాలు పెరిగాయని ఆరోపణ
– 5 లక్షల కోట్ల బెడదకు శ్రీకారం చుడుతున్న పాలన అని తీవ్ర విమర్శలు
– కుత్బుల్లాపూర్, జీడిమెట్ల పారిశ్రామిక వర్గాలలో పర్యటించిన కేటీఆర్
అక్షరగళం, హైదరాబాద్:
రాష్ట్రంలో గత ఆరు నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వం భూముల వ్యాపారానికి ప్రాధాన్యం ఇస్తూ, లక్షల కోట్ల రూపాయల దోపిడినే ధ్యేయంగా పని చేస్తూ ప్రజా ప్రయోజనాలను పక్కనబెడుతున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా విమర్శించారు. హెచ్ఐఎల్టిపి పాలసీ పేరిట అమలు చేస్తున్న విధానాలు పూర్తిగా రియల్ ఎస్టేట్ బ్రోకర్లకు అనుకూలమయ్యేలా ఉన్నాయని మండిపడ్డారు. జీడిమెట్ల, కుత్బుల్లాపూర్ పారిశ్రామిక ప్రాంతాల్లో గురువారం ఆయన పర్యటిస్తూ స్ధానిక హమాలీ కూలీల అడ్డాలో మిడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ “పరిశ్రమలను తీసుకురావాలి, ఉపాధి కల్పించాలి అనే అంశాలపై ప్రభుత్వం పనిచేయకుండా భూములను అమ్ముకుంటూ దోచుకోవడమే ఈ ప్రభుత్వానికి తెలిసిన పని” అని విమర్శించారు.
“హెచ్ఐఎన్టిపి విధానాన్ని అధికారంలోకి వచ్చిన వెంటనే రద్దు చేస్తాం”
పారిశ్రామిక అవసరాల కోసం కేటాయించిన భూములను రియల్ ఎస్టేట్ వ్యాపారంగా మార్చే ప్రయత్నాన్ని ప్రజలు గుర్తించాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. 11 వందల ఎకరాలకు పైగా భూములను గత ప్రభుత్వాలు పారిశ్రామిక అభివృద్ధికోసం ఇచ్చినప్పుడు, ఇప్పుడు వాటిని గజం 4 వేల రూపాయలకు అమ్మేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధపడిందని దుయ్యబట్టారు. అధికారంలోకి వచ్చిన వేంటనే “హెచ్ఐఎన్టిపి విధానాన్ని రద్ధు చేస్తామని తెలిపారు. “కోకాపేట్‌లో ఎకరం 130 కోట్లు అని గొప్పలు చెప్పుకునే ప్రభుత్వం, జీడిమెట్లలో ప్రభుత్వ ఆస్తులను తక్కువ ధరకు ఎందుకు అమ్ముతుంది? దీనిలో ఎవరి ప్రయోజనం ఉంది?” అని సూటిగా ప్రశ్నించారు. గతంలో ఔటర్ రింగ్ రోడ్డు లీజు అంశంపై రేవంత్ చేసిన విమర్శలు గుర్తుచేస్తూ, “ఇప్పుడు అదే ఓఆర్ఆర్ ను ఏకంగా అమ్ముకునేందుకు సిద్దమయ్యారు అని.

కాలుష్య పరిశ్రమల తరలింపుకు మేము వ్యతిరేకం కాదు: కేటీఆర్
కాలుష్యకారక పరిశ్రమలను నగరం బయటకు తరలించడంలో తమ పార్టీకి ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేసిన కేటీఆర్, అయితే ప్రజా ప్రయోజనాల కోసం కేటాయించిన భూములను అమ్మేయడానికే ఈ తరలింపును సాకుగా ఉపయోగించకూడదని విమర్శించారు. అవసరమైతే ఆ ప్రాంతాలలో గ్రీన్ జోన్ పరిశ్రమలు, స్పోర్ట్స్ కాంప్లెక్స్, పాఠశాలలు, ఇండ్లు నిర్మించవచ్చని సూచించారు.

“ఢిల్లీ పెద్దలకు కప్పం కట్టడానికే రియల్ ఎస్టేట్ దందా”
తెలంగాణలో జరుగుతున్న భూముల అమ్మకాల వెనుక ఢిల్లీ నేతలకు కప్పం కట్టడం, స్థానిక పదవులను కాపాడుకోవడం ప్రధాన ఉద్దేశమని కేటీఆర్ ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చుట్టూ రియల్ ఎస్టేట్ మాఫియా పనిచేస్తుందని, వారి సహకారంతోనే 5 లక్షల కోట్ల రూపాయల అక్రమ ప్రణాళికలు అమలు చేస్తోందని విమర్శించారు. ప్రజల సహవాకంతో ఈ దోపిడిని అడ్డుకుంటామని ఈ సంధ్బంగా ఆయన స్పష్టం చేశారు.

