- రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా మట్ట చంద్ర శేఖర్ గౌడ్ ఏకగ్రీవం

వెల్దండ నవంబర్ 24 (అక్షర గళం) హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగినటువంటి తెలంగాణ గ్రామ పాలన ఆఫీసర్స్ అసోసియేషన్ రాష్ట కమిటీ ఎన్నికలో భాగంగా మండల కేంద్రానికి చెందిన గ్రామ పాలన అధికారి మట్ట చంద్ర శేఖర్ గౌడ్ ను రాష్ట ఉపాధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. తనపై నమ్మకం ఉంచి ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించిన రాష్ట గ్రామ పాలన అధికారులు యొక్క సమస్యలను సంబంధిత ఉన్నత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి వారి సమస్యలను పరిష్కరించే దిశగా కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్ర ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ ,డిప్యూటీ కలెక్టర్ లచ్చి రెడ్డి, అలాగే హైదరాబాద్ ఆర్డీఓ రామకృష్ణ మరియు గ్రామ పాలన అధికారుల సంఘం రాష్ట అధ్యక్షుడు గరికే ఉపేందర్ రావు, రాష్ట గ్రామ పాలన అధికారుల అందరికీ ధన్యవాదాలు తెలిపారు.

