ఆమనగల్లు, అక్టోబర్ 05 ( అక్షర గళం): బతుకమ్మ పండుగను ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకువచ్చి తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు పునర్జీవం పోశారని కౌన్సిలర్ కమటం రాధమ్మ వెంకటయ్య అన్నారు.గురువారం ఆమనగల్లు మున్సిపాలిటీ పరిధిలోని 8వార్డు సంకటోనిపల్లిలో మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేసి మహిళలందరికీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఆడబిడ్డలు సంతోషంగా జరుపుకునే బతుకమ్మ పండుగను తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోందన్నారు.ఈ కార్యక్రమములో మున్సిపల్ కమిషనర్ శ్యామ్ సుందర్,ఆర్ఐ చంద్రకళ,ఎల్లయ్య,బాలకృష్ణయ్య,జైపాల్,పెద్దయ్య,మమతా,భాగ్యమ్మ,అనంతమ్మ,జంగమ్మ తదితరులు పాల్గొన్నారు