Mallampet dog cruelty case: మల్లంపేటలో కుక్కను హింసించి సజీవ దహనం చేసిన ఘటనపై దుండిగల్ పోలీసులు కేసు నమోదు చేశారు.
అక్షరగళం, దుండిగల్:
మల్లంపేటలోని కేవీఆర్ వ్యాలీ ప్రాంతం పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ సమీపంలో కుక్కను హింసించి సజీవ దహనం చేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది.
మల్లంపేటలో జంతు హింస ఘటన వివరాలు
స్థానికంగా మద్యం మత్తులో ఉన్న కొందరు వ్యక్తులు ఆదివారం మధ్యాహ్నం కుక్కను కర్రలు, రాళ్లతో వెంబడిస్తూ దాడి చేశారు. చివరకు తీవ్రంగా హింసించి సజీవ దహనం చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై జంతుప్రేమికుల ఫిర్యాదు మేరకు కేవీఆర్ వ్యాలీ కాలనీ శ్రీశైలం, మనోజ్‌పై దుండిగల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. జంతు హక్కుల కార్యకర్తలు నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

