అక్షరగళం, శేరిలింగంపల్లి : అసెంబ్లీ శీతాకాల సమావేశాల సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని ఆయన ఛాంబర్‌లో శేరిలింగంపల్లి ఎమ్మెల్యే, పి ఎ సి చైర్మన్ ఆరెకపూడి గాంధీ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శేరిలింగంపల్లి నియోజకవర్గంలో నెలకొన్న పలు సమస్యలు, చేపట్టవలసిన అభివృద్ధి పనులను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. మియాపూర్ చౌరస్తా ఫ్లై ఓవర్‌కు జనవరిలో శంకుస్థాపన చేయాలని కోరగా ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు. అలాగే అసంపూర్తి పనులు, నాలల విస్తరణ, చెరువుల సుందరీకరణకు సంబంధించిన సమస్యలపై నిధులు మంజూరు చేసి అధికారులకు తగిన ఆదేశాలు ఇవ్వాలని పి ఎ సి చైర్మన్ గాంధీ కోరారు.

