అక్షర గళం, నిజాంపేట్: ప్రతి నెల చివరి ఆదివారం నిర్వహించే మన్ కీ బాత్ కార్యక్రమం బీజేపీ కేంద్ర ప్రభుత్వ పారదర్శక పాలనకు ప్రత్యక్ష నిదర్శనమని బీజేపీ నేతలు అన్నారు. ఆదివారం నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రగతి నగర్‌లో బీజేపీ సీనియర్ నేత డాక్టర్ ఎంఆర్ఎస్ రాజు నివాసంలో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని నాయకులు వీక్షించారు. ఈ సందర్భంగా బీజేపీ నేతలు మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమం రెండింటికీ సమాన ప్రాధాన్యం ఇచ్చే ప్రభుత్వం నరేంద్ర మోడీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వమేనని తెలిపారు. ప్రధాని మోడీ ప్రతి నెల మన్ కీ బాత్ ద్వారా దేశ ప్రజలతో నేరుగా సంభాషించడం విశేషమన్నారు.
ఈ కార్యక్రమంలో గాజులరామారం కార్పొరేటర్ రావుల శేషగిరి, బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర నేత దాసి నాగరాజు, ప్రగతి నగర్ బీజేపీ అధ్యక్షులు నరేంద్ర చౌదరి తదితరులు పాల్గొన్నారు.

