రికార్డు బద్దలు కొట్టిన బంగారం…రాత్రికి రాత్రే సీన్ రివర్స్!

బంగారం ధర రోజురోజుకు పెరుగుతోంది. కొన్నిసార్లు తగ్గినట్టే కనిపించినా…మళ్ళీ సామాన్యులకు అందనంత ఎత్తుకు బంగారం ధరలు ఎగబాకుతున్నాయి. బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి చుక్కలు కనిపిస్తున్నాయి. యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గించడంతో.. పట్టపగ్గాల్లేకుండా దూసుకెళ్తున్నాయి. ఇవాళ మరోసారి పెరిగిన బంగారం, వెండి ధరలు ఆల్ టైమ్ గరిష్ట స్థాయిలకు చేరాయి. ఇంటర్నేషనల్ మార్కెట్లో మాత్రం పసిడి ధర జీవన కాల గరిష్టాలకు చేరువ కాగా.. వెండి ఆల్ టైమ్ హైని దాటి ఇంకా పరుగులు పెడుతోంది. ఇప్పుడు ఎక్కడ రేట్లు ఎలా ఉన్నాయో చూద్దాం.

మన దేశంలో బంగారం ధర ఒక్కరోజులో భారీగా పెరిగింది. 22 క్యారెట్లకు చెందిన పసిడి ధర ఇవాళ రూ. 2,250 పెరగడంతో తులం హైదరాబాద్ నగరంలో రూ. 1,22,100 కు చేరింది. ఇదే ఇప్పటివరకు అత్యధిక స్థాయి. దీనికి ముందు వరుసగా 2 రోజుల్లో రూ. 400, రూ. 800 చొప్పున పెరిగింది. ఇక 24 క్యారెట్ల పుత్తడి ధర రూ. 2450 పెరగడంతో 10 గ్రాములకు ప్రస్తుతం రూ. 1,33,200 కు చేరింది.
వెండి ధర చూస్తే ఒక్కరోజులోనే మరో రూ. 6 వేలు ఎగబాకింది. దీంతో కేజీకి ఇప్పుడు రూ. 2.15 లక్షల మార్కును తాకింది. ఇది కూడా ఆల్ టైమ్ హై వాల్యూనే. దీనికి ముందు వరుసగా రూ. 2000, రూ. 8 వేలు, రూ. 1000, రూ. 2100 ఇలా 5 రోజుల్లో మొత్తంగా చూస్తే రూ. 19,100 పెరగడం ఆందోళన కలిగిస్తోంది. యూఎస్ ఫెడ్ కీలక వడ్డీ రేట్లను మరోసారి తగ్గించడంతో బంగారం, వెండి ధరలు ఈ స్థాయిలో పెరుగుతున్నాయని చెప్పొచ్చు.

బంగారం ధర భారీగా పెరిగింది కదా ఇక తగ్గుతుందిలే అని చూసిన వారికి వరుస షాకులు తగులుతున్నాయి. రోజురోజుకూ సరికొత్త రికార్డు స్థాయిల్ని తాకుతూనే ఉన్నాయి. ఇప్పుడు మరోసారి ఆల్ టైమ్ హై మార్కును చేరాయి. ఒక్కరోజులోనే బంగారం, వెండి ధరల్లో భారీ మార్పు కనిపించింది. చాలా రోజుల తర్వాత ఒక్కరోజులో ఈ స్థాయిలో పెరగడం గమనార్హం. ఇప్పుడు దేశీయంగా గోల్డ్, సిల్వర్ రేట్లు సరికొత్త జీవన కాల గరిష్టాల్ని నమోదు చేశాయి. ఇదే సమయంలో అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం ధర ఆల్ టైమ్ హైకి చేరువలోకి వెళ్లింది. సిల్వర్ రేటు ఎప్పుడు ఆల్ టైమ్ హై మార్కును దాటి ఇంకా దూసుకెళ్తూనే ఉంది. చివరిసారిగా బంగారం, వెండి ధరలు వరుసగా అక్టోబర్ 17, అక్టోబర్ 15న ఆల్ టైమ్ హైని తాకగా.. ఇప్పుడు ఆ మార్కును అధిగమించాయి. దీంతో బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి భారీ షాక్ తగులుతోంది.
ఇంటర్నేషనల్ మార్కెట్లో స్పాట్ గోల్డ్ రేటు నిన్న ఒక దశలో ఔన్సుకు 4250 డాలర్ల స్థాయిలో ఉండగా.. రోజు వ్యవధిలో ఇంట్రాడేలో 4,330 డాలర్ల మార్కు దాటి ట్రేడయింది. ఇప్పుడు మాత్రం కాస్త వెనక్కి తగ్గి 4,300 డాలర్ల మార్కు దిగువన ఉంది. సిల్వర్ రేటు ఒక దశలో 64 డాలర్ల మార్కు దాటి ట్రేడవగా.. చివరకు 62 డాలర్ల మార్కు దిగువకు చేరింది.


