ఆదర్శ గ్రామ నిర్మాణమే లక్ష్యంగా…
గ్రామ సేవకు ముందుకు వచ్చిన 23 ఏళ్ళ యువతి
సర్చంచ్ అభ్యర్థిగా బరిలోకి దిగిన స్వాతీ జగదీష్ గౌడ్
సమస్యలతో ఫుట్‌బాల్ ఆడుకుందాం…మన ఊరిని ఉన్నతంగా తీర్చిదిద్దుకుందాం…అంటోంది 23 ఏళ్ళ స్వాతీ జగదీష్ గౌడ్. నిజామాబాద్ జిల్లా, సిరికొండ మండలం, పెద్ద వాల్గొట్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో యువత, మహిళల ప్రోత్సాహంతో… స్వాతీ జగదీష్ గౌడ్ ఉత్సాహంగా ఎన్నికల బరిలో దిగింది.
తనను సర్పంచ్‌గా గెలిపిస్తే…పెద్ద వాల్గొట్ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని…మహిళా యువశక్తి చాటుతానని ఘంటాపథంగా చెబుతోంది.
పెద్ద వాల్గొట్ గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు, బలమైన ఆశయాలతో మీ ముందుకు వస్తున్నానని ఒక్కసారి నాకు అవకాశం ఇస్తే…గ్రామంలో ఉన్న అన్ని రకాల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ప్రతి క్షణం, ప్రతీ రోజు… నిరంతరం…పని చేసి మహిళా యువశక్తి అంటే ఏంటో చూపిస్తానని స్వాతీ జగదీష్ గౌడ్ హామీ ఇస్తుంది.
ఎన్నో ఏళ్ళుగా పెద్ద వాల్గొట్ గ్రామంలో…చాలా సమస్యలు పరిష్కారం కాకుండానే మిగిలిపోతున్నాయని… సమస్యల పరిష్కారం కోసం ప్రతి నిత్యం అందరం కలిసికట్టుగా పోరాటం చెయ్యాల్సి అవసరం ఎంతైనా ఉందన్నారు.
కుల, మత, రాజకీయాలకు అతీతంగా…అన్ని కులాల, వర్గాల వారి అభ్యున్నతికి పాటు పడతానని పెద్ద వాల్గొట్ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా మాట ఇస్తున్నానని స్వాతీ జగదీష్ గౌడ్ తెలిపారు. భావి తరాలకు బంగారు భవిష్యత్తును అందించేందుకు స్వచ్ఛమైన గ్రామంగా తీర్చిదిద్దేందకు అన్ని వేళలా ముందుకు సాగుతానని అన్నారు.
అవినీతి రహిత పాలన: పారదర్శకతతో కూడిన, అవినీతి లేని గ్రామ పరిపాలనను అందిస్తానన్నారు.
యువశక్తికి ప్రాధాన్యత ఇచ్చి… యువత ఆలోచనలకు గౌరవం ఇచ్చి… వారి ఆశయాలను ఆచరణలో పెడతానన్నారు.
రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల నుంచి వచ్చే అన్ని రకాల పథకాలను అర్హులైన అందరికీ అందేలా చూస్తానని…
ముఖ్యంగా విద్యా, వైద్యం, మహిళా సంక్షేమం, రైతన్నల వ్యవసాయం, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రతి క్షణం పాటుపడతానని పెద్ద వాల్గొట్ సర్పంచ్ అభ్యర్థి స్వాతీ జగదీష్ గౌడ్ తెలిపారు. ఫుట్ బాల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాల్సిందిగా ప్రజలను కోరారు.

