అమనగల్లు, జూలై 29 (అక్షర గళం) ;
లంబాడాల ఆరాధ్యదైవం సీత్లా భవాని పండుగ మహిళలు సోమవారం బోనాలు సమర్పించి సీత్లా పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఆమనగల్లు మున్సిపాలిటీ పరిధిలోని 10వ వార్డు విటాయిపల్లిలో కౌన్సిలర్ సుజాత రాములు ఆధ్వర్యంలో గిరిజన మహిళలు డప్పు వాయిద్యాలతో నృత్యాలు చేస్తూ బోనాలతో వచ్చి మహిళలు అమ్మవారికి సమర్పించారు. సీత్ల పండుగ జరుపుకోవడం వల్ల వర్షాలు బాగా కురవాలని పంటలు బాగా పండుతాయని,ప్రజలు, పశువులు ఆరోగ్యంగా ఉంటారని, తండాలో యేటా ఈ పండుగను పురస్కరించుకొని బోనాలతో అమ్మవారికి అర్పించడం ఆనవాయితిగా వస్తుందని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తండా నాయకులు రాజు, బాలు, వాడ్య, సురేష్, రవీందర్, రవి, శ్రీను, గోపి, దశరథ్, మల్య, తిరుపతి, లాలాన్, మహేష్, హర్ష, గన్య, రమేష్ వెంకటేష్, మహిళలు తదితరులు పాల్గొన్నారు.