శ్రీశైలం ప్రాజెక్టులోకి వరదప్రవాహం

Estimated read time 0 min read

పదిగేట్లు ఎత్తి నీటి విడుదలశ్రీశైలం,

అక్షరగళం వెబ్ డెస్క్​: ఎగువ ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయానికి వరద భారీగా పెరుగుతున్నది. గంట గంటకు వరద ఉధృతి మరింత పెరుగుతూ వస్తున్నది. ప్రస్తుతం ప్రాజెక్టు పది గేట్లను 15 అడుగుల వరకు ఎత్తి 3,76,670 క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువకు వదులుతున్నారు. దాంతో వరద నాగార్జున సాగర్‌ వైపు వెళ్తున్నది. జూరాలా, సుంకేశుల జలాశయాల నుంచి డ్యామ్‌కు ఇన్‌ఎª`లో కొనసాగుతున్నది. శ్రీశైలం జలాశయానికి ప్రస్తుతం 3,95,162 క్యూసెక్కుల ఇన్‌ఎª`లో ఉండగా.. అవుట్‌ ఎª`లో 4,36,902 క్యూసెక్కులుగా నమోదైంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 884.40 అడుగులుగా ఉన్నది. జలాశయం పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 215.807 టీఎంసీలు.. ప్రస్తుతం జలాశయంలో 212.4385 టీఎంసీల నీటి నిల్వ ఉన్నది. కుడి, ఎడమగట్టులోని జల విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాల్లో కరెంటు ఉత్పత్తి కొనసాగుతున్నది. మరో వైపు ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో శ్రీశైలం పరిసరాలన్నీ పర్యాటకులతో కిక్కిరిసిపోతున్నాయి. డ్యామ్‌ అందాలను చూసేందుకు పర్యాటకులు భారీగా తరలివస్తున్నారు. దాంతో ఘాట్‌ రోడ్లన్నీ వాహనాలతో నిండిపోయాయి.

You May Also Like

More From Author