న్యూడిల్లీ, అక్షరగళం: లోక్‌సభలో తమ పార్టీ తరఫున చీఫ్ విప్, విప్‌లను భాజపా నియమించింది. చీఫ్ విప్, 16మంది విప్‌లను నియమించినట్లు భాజపా పార్లమెంటరీ పార్టీ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. చీఫ్ విప్‌గా డా.సంజయ్ జైశ్వాల్‌ను నియమించగా.. విప్‌లుగా తెలంగాణకు చెందిన చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డితో పాటు పలువురిని నియమించింది. విప్‌లుగా నియమితులైన వారిలో భాజపా ఎంపీలు దిలీప్ సైకియా, గోపాల్‌జీ ఠాకూర్, సంతోష్ పాండే, కమల్‌జీత్ షెరావత్, ధావల్ లక్ష్మణ్‌భాయి
పటేల్, దేవుసిన్హ్ చౌహాన్, జుగల్ కిశోర్ శర్మ, కోట శ్రీనివాస్ పుజారి, సుధీర్ గుప్తా, స్మిత ఉదయ్ వాఫ్‌ు, అనంత నాయక్, దామోదర్ అగర్వాల్, సతీశ్ కుమార్ గౌతమ్, శశాంక్ మణి, ఖగెన్ ముర్ము నియమిస్తున్నట్లు భాజపా పార్లమెంటరీ పార్టీ కార్యాలయం కార్యదర్శి డా.శివ్ శక్తినాథ్ బక్షి ఓ ప్రకటన విడుదల చేశారు