మాదాపూర్‌లో రేవ్‌ పార్టీ

Estimated read time 0 min read

హైద‌రాబాద్‌ మాదాపూర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో రేవ్ పార్టీ జ‌రిగింది. టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు చాక‌చ‌క్యంగా ప‌ట్టుకున్నారు. 14 మంది యువకులు, ఆరుగురు మహిళలను అదుపులోకి తీసుకున్నారు. నిర్వాహకులు ఐదుగురిపై కేసు నమోదు చేశారు. మిగిలిన వారికి కౌన్సిలింగ్‌ ఇచ్చి పంపించారు. ఇందులో కొందరు డ్రగ్స్‌ తీసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. రేవ్‌ పార్టీలో ఒక గ్రాము కొకైన్‌, రెండు గ్రాముల ఎండీఎంఏ, మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం రూ.1.25లక్షలు విలువ చేసే మద్యం, డ్రగ్స్‌ సీజ్‌ చేశారు. బేగంపేటకు చెందిన నాగరాజు పుట్టిన రోజు సందర్భంగా ఈ రేవ్‌ పార్టీ ఏర్పాటుచేసినట్టు పోలీసులు గుర్తించారు. ఈవెంట్‌ ప్రమోటర్‌ కిషోర్‌ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

You May Also Like

More From Author