*నాలుగు నెలలుగా జీతాలు లేక అవస్థలు
జీతాల కోసం బిక్షాటన చేస్తున్న గ్రామ పంచాయతి సిబ్బంది.
రంగారెడ్డి జిల్లా బ్యూరో అక్షరగళం (యాచారం) జూలై 29: :గ్రామ పంచాయతీ సిబ్బందిని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతూన్నారు యాచారం మండలం గ్రామ పంచాయతీ సిబ్బంది.నాలుగు నెలల నుండి జీతాలు లేక అటు కుటుంబాన్ని పోషించలేక ఇటు విధులు నిర్వహించలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఇందులో భాగంగా ఇంటింటికి తిరిగి బిక్షాటన చేస్తున్నామని చెబుతున్నారు.గత నాలుగు నెలల నుంచి గ్రామ పంచాయతీ సిబ్బందికి వేతనాలు ఇవ్వకుండా తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం స్పందించి,గ్రామపంచాయతీలో విధులు నిర్వహిస్తున్న వారికి బకాయిలతో వేతనాన్ని పెంచాలని డిమాండ్ చేశారు.