చట్నీలో స్విమ్మింగ్ చేస్తున్న ఎలుక … బయటకు వచ్చేందుకు పడే పాట్లు…..
సంగారెడ్డి జిల్లా సుల్తాన్‌పూర్ జేఎన్‌టియూ ఇంజనీరింగ్ కాలేజీ క్యాంపస్ హాస్టల్‌లో దారుణ ఘటన…
జేఎన్‌టియూ ఇంజనీరింగ్ కాలేజీ :
ఉదయం హాస్టల్ మెస్‌లో చట్నీ సాంబర్‌లో ఎలుక ప్రత్యక్షమైంది. కాలేజీ తరగతులకు వెళ్లే ముందు విద్యార్థులు ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేయడానికి క్యాంటీన్‌కు వెళ్లారు. అయితే అక్కడ చట్నీ సాంబర్‌లో ఓ బతికున్న ఎలుక కనిపించింది. చట్నీ గిన్నెల్లో ఎలుక చక్కర్లు కొట్టడం చూసి విద్యార్ధులు షాక్‌కు గురయ్యారు. మెస్ నిర్వహకుల నిర్లక్ష్యం కారణంగానే ఇలా జరిగిందని విద్యార్థులు మండిపడుతున్నారు.
చట్నీ పాత్రపై ఎలాంటి మూత లేకపోవడంతో అందులో ఎలుక పడిందని అంటున్నారు. ఎలుకు చట్నీ సాంబర్‌లో అటూ ఇటూ ఈదుకుంటూ బయటకు వచ్చేందుకు విశ్వప్రయత్నాలు చేసింది. అందుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే హాస్టల్ మెస్ నిర్వాహకుల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విద్యార్థులు ఫైర్ అవుతున్నారు. వారు నాణ్యత లేని భోజనాన్ని అందిస్తున్నారని మండిపడ్డారు. నాలుగు రోజుల క్రితమే తాము భోజన నాణ్యత విషయంపై పిర్యాదు చేశామన్నారు.
మెస్ కాంట్రాక్టర్ పై మండిపడుతున్న విద్యార్థులు :
మెస్ కాంట్రాక్టర్‌ను మార్చాలని కాలేజీ ప్రిన్సిపల్‌ను డిమాండ్ చేసినట్లు చెప్పారు. అయినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని.. ఇప్పుడు ఏకంగా చట్నీ సాంబర్‌లో ఎలుక ప్రత్యక్షమైంని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు తాము హోస్టల్ భోజనం బాగోలేక.. బయట నుంచి తెచ్చుకుందామంటే భద్రతా సిబ్బంది అనుమతించటం లేదని విద్యార్తులు ఆరోపించారు. క్యాంపస్‌లోకి బయటి ఫుడ్ అనుమతించటం లేదని.. హాస్టల్‌లో నాణ్యత లేని ఆహారం తినలేక తాము అనారోగ్యం పాలవుతున్నామని వాపోయారు. నాసిరకం భోజనాలపై ఇప్పటికైనా కాలేజీ యాజమాన్యం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కాంట్రాక్టర్‌ను మార్చి నాణ్యమైన భోజనాలు అందించాలని యాజమాన్యాన్ని కోరుతున్నారు.
ప్రిన్సిపాల్ ని డిమాండ్ చేస్తున్నవిద్యార్థులు :
కాగా, చట్నీలో ఎలుక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కాగా.. నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. దాదాపు అన్ని హాస్టళ్లలోనూ ఇదే పరిస్థితి ఉంటుందని తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇష్టం ఇంటే ఉండండి.. లేదంటే వెళ్లిపోండనే ధోరణితో హాస్టల్ నిర్వహకులు ఉంటున్నారని కామెంట్లు చేస్తున్నారు .