- బి.అర్.ఎస్,మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్
ఎల్లారెడ్డి,జూలై-29(అక్షరగళం)
ఎల్లారెడ్డి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే జజాల సురేందర్ అస్వస్థతకు గురై సోమవారం కోలుకున్నట్టు ఒక వీడియో ద్వారా తెలియజేశారు. (బి.ఆర్.ఎస్) పార్టీ కార్యకర్తలకు ఎల్లారెడ్డి ప్రజలందరికీ పేరుపేరునా నమస్కారాలు తెలియజేశారు గత పదిహేను రోజుల నుండి ఫోన్ ద్వారా గాని భౌతికంగా గాని అస్వస్థతకు గురి కావడంతోనీ వైద్యుల సూచన మేరకు ఆసుపత్రిలో చేరడం జరిగిందని అందుకే ఫోన్ స్విచాఫ్ చేసి ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగిందని పైన భగవంతుని దయతోనే ప్రజలందరి ఆశీర్వాదంతో సంపూర్ణ ఆరోగ్యం తోనీ కోలుకోవడం జరిగిందని మరియు ఎల్లారెడ్డి ప్రజలకు నేను ఫోన్ స్విచ్ ఆఫ్ చేసినందుకు గాని అందుబాటులో లేనందుకు గాని మీరందరూ పెద్ద మనసుతో మన్నించాలని కోరుకుంటూ అలాగే దయచేసి ఎవరు కూడా ఇబ్బంది పడకుండా అలాగే నన్ను కలవాలని హైదరాబాద్ కి రావాలని ఎవరు అనుకోవద్దు మీరు ఇబ్బంది పడి నన్ను ఇబ్బంది పెట్టొద్దని వైద్యుల సూచన మేరకు ఇంకా ఒక వారం పదిహేను రోజులు ఎవరిని కలవద్దని వైద్యులు చెప్పడంతో ప్రతి ఒక్కరూ అందరు సహకరించాలని కోరుకుంటూ ప్రతి ఒక్క కార్యకర్తకు ధన్యవాదాలు తెలియజేశారు.