Sunday, December 22, 2024
spot_img
HomeBreakingఎస్సీవర్గీకరణను స్వాగతిస్తున్నాం

ఎస్సీవర్గీకరణను స్వాగతిస్తున్నాం

సుప్రీం తీర్పుతో సామాజిక న్యాయం గెలిచింది

టిడిపి సామాజిక న్యాయానికి కట్టుబడి ఉంది

రాయలసీమను రతనాల సీమగా మారుస్తా

సాగునీటి సమస్యలు లేకుండా సంపద సృష్టిస్తా

శ్రీశైలం పర్యటనలో ఎపి సిఎం చంద్రబాబు వెల్లడి

స్వామి అమ్మవార్లను దర్శించుకున్న చంద్రబాబు

కృష్ణమ్మకు జలహారతి పట్టిన సిఎం

హైదరాబాద్ అక్షరగళం వెబ్ డెస్క్​: ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు.  ఎస్సీ, ఎస్టీ వర్గీకరణకు సుప్రీంకోర్టు సమర్థించింది. సామాజిక న్యాయం టీడీపీ సిద్దాంతం. 2024 ఎన్నికల్లో టికెట్ల విషయంలో సామాజిక న్యాయం పాటించాం. ఈ ప్రభుత్వం అందరిది. అందరికీ న్యాయం జరగాలి. జీరో పావర్టీ కింద ఉన్నపేదలను పైకి తీసుకు రావడమే నా లక్ష్యం. రూ.33 వేల కోట్లు ఖర్చు చేసి పింఛన్లు పంపిణీ చేస్తున్నాం. దోచుకోవడం, దాచుకోవడం, విధ్వంసం చేయడం వైసీపీ నైజం. రెండు నెలల్లో ఏమి చేశారని వైసీపీ అంటోంది. నేనేమి చేశానో ప్రజలకు తెలుసు. సిద్దేశ్వరం దగ్గర కృష్ణానదిపై బ్రిడ్జి కం బ్యారేజ్‌ నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి నీటి సమస్య పరిష్కరిస్తా అని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. కర్నూలు జిల్లా సున్నిపెంటలో నిర్వహించిన ’మన నీరు`మన సంపద’ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ సుప్రీం తీర్పుపై స్పందించారు. సామాజిక న్యాయం, దామాషా ప్రకారం ప్రతి వర్గానికి న్యాయం చేయడం తెదేపా సిద్దాంతం. గతంలో వర్గీకరణకు సంబంధించి ఏబీసీడీలుగా కేటగిరీ తీసుకొచ్చాను. అందరికీ న్యాయం జరగాలి. ఎన్నికల్లో టికెట్ల కేటాయింపు కూడా అలాగే చేశాం. ఈ ప్రభుత్వం అందరిది.. విూ అందరివాడిగా ఉంటా అని చంద్రబాబు తెలిపారు. గత ప్రభుత్వం నీటిపారుదల ప్రాజెక్టులను పట్టించుకున్న పాపాన పోలేదని సీఎం విమర్శించారు. ప్రాజెక్టులకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోందని చెప్పారు. రాయలసీమను రతనాల సీమగా మార్చే బాధ్యత తనదని చెప్పారు.

సంపద సృష్టితో పేదరిక నిర్మూలన సాధ్యమవుతుందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన అన్ని హావిూలను నెరవేరుస్తామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. శ్రీశైలాన్ని దివ్యక్షేత్రంగా అభివృద్ధి చేస్తామని చంద్రబాబు నాయుడు తెలిపారు. గురువారం నాడు శ్రీశైలంలో ముఖ్యమంత్రి పర్యటించారు. ఈ సందర్భంగా సున్నిపెంటలో ఏర్పాటు చేసిన ప్రజావేదిక సభలో సీఎం ప్రసంగించారు. ఏపీకి మంచి రోజులొచ్చాయని అన్నారు. రానున్న రోజుల్లో కూడా ప్రజలు మంచిగా ఉండాలని భ్రమరాంబ మల్లికార్జున స్వామిని కోరుకున్నానని చెప్పారు. జూలైలోనే శ్రీశైలం ప్రాజెక్టు నిండటం, జల హారతి ఇవ్వడం సంతోషమని తెలిపారు. రాయలసీమను సస్యశ్యామలం చేయడం ఎన్టీఆర్‌ కల అని సీఎం చంద్రబాబు ఉద్ఘాటించారు. రాయలసీమకు నీళ్లు ఇచ్చిన తర్వాతనే తెలుగు గంగ నుంచి చెన్నైకి నీళ్లు తీసుకెళ్లాలని దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు చెప్పారని గుర్తుచేశారు.

రాయలసీమ ప్రాజెక్టుల కోసం రూ.12 వేల కోట్లు ఖర్చు చేశాను. కానీ మాజీ సీఎం జగన్‌ కేవలం రూ. 2వేల 11 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. జగన్‌ పాలనలో జనం భయంతో బతికారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక జనం స్వేచ్ఛగా ఉన్నారు. ఎన్నికల్లో చాలా హావిూలు ఇచ్చాను. కానీ ఖజానా ఖాళీ అయింది. మరో రెండు, మూడు రోజుల్లో నాగార్జున సాగర్‌, పులిచింతల ప్రాజెక్టులు నిండుతాయి. వరద నీరు సముద్రంలో కలవకుండా ప్రాజెక్టులకు

తరలించేలా ప్రణాళికలు రూపొందించి రాయలసీమను రత్నాల సీమ చేస్తా.. ఇది సాధ్యం అవుతుందని అననారు.  వైసీపీ పాలనలో రాయలసీమ రాళ్ల సీమగా మారింది. నీరు ఉంటే సంపద సృష్టిస్తాం. సంపద ద్వారా ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. దీని వల్ల పేదరికం పోతుంది. యువతలో నైపుణ్యాన్ని పెంపొందించేందుకు స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌లు ఏర్పాటు చేస్తాం అని సీఎం చంద్రబాబు తెలిపారు.

శ్రీశైలం మండలం యువత అమెరికాలో ఉద్యోగం పొందేలా స్కిల్స్‌ నేర్పిస్తామని అన్నారు. అంతకు ముందు శ్రీశైలం జలాశయం వద్ద కృష్ణమ్మకు ముఖ్యమంత్రి చంద్రబాబు జలహారతి ఇచ్చారు. ‘ప్రాణికోటి జీవనాధారమైన జలాలను ఇచ్చే నదులని దేవతలుగా భావించి పూజించే సంస్కృతి మనది. నిండుకుండలా ఉన్న శ్రీశైలం జలాశయం వద్ద కృష్ణమ్మకు జలహారతిని ఇవ్వడం ఎంతో సంతోషాన్ని, సంతృప్తిని ఇచ్చింది. సమృద్ధిగా కురుస్తున్న వర్షాలు రైతుల కళ్ళలో ఆనందం నింపుతున్నాయి. ఇది రాష్టాన్రికి శుభసూచకం‘ అంటూ చంద్రబాబు స్పందించారు. ఈ సందర్భంగా నీటి వినియోగదారు సంఘాలతో చంద్రబాబు ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు.

సీఎం చంద్రబాబు గురువారం శ్రీశైలంలో పర్యటించారు. శ్రీశైల మహాక్షేత్ర పర్యటనలో భాగంగా శ్రీ భ్రమరాంబ మల్లికార్జున భ్రమరాంబ అమ్మవార్లను సీఎం చంద్రబాబు దర్శించుకున్నారు. శ్రీశైలాన్ని దివ్యక్షేత్రంగా అభివృద్ధి చేస్తామని అన్నారు. అనంతరం సున్నిపెంటలో ఏర్పాటు చేసిన ప్రజావేదిక సభలో ప్రసంగించిన ఆయన.. ఏపీకి మంచి రోజులొచ్చాయని అన్నారు. రానున్న రోజుల్లో కూడా ప్రజలు మంచిగా ఉండాలని భ్రమరాంబ మల్లికార్జున స్వామిని కోరుకున్నానని తెలిపారు. జులైలోనే శ్రీశైలం ప్రాజెక్టు నిండటం, జల హారతి ఇవ్వడం సంతోషమని తెలిపారు. రాయలసీమను సస్యశ్యామలం చేయడం ఎన్టీఆర్‌ కల అని సీఎం చంద్రబాబు ఉద్ఘాటించారు. సిఎం వెంల మంత్రి ఫరూక్‌ తదితరులు ఉన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments