Monday, December 23, 2024
spot_img
HomeBreakingఎస్సీ,ఎస్టీ వర్గీకరణకు సుప్రీం ఆమోదం

ఎస్సీ,ఎస్టీ వర్గీకరణకు సుప్రీం ఆమోదం

ఉపకులాల వర్గీరణను సమర్థించిన ధర్మాసనం
రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ఉందని వెల్లడి
ఏడుగురు సభ్యుల సిజెఐ ధర్మాసనం సంచలన తీర్పు
న్యూఢల్లీి,అక్ష‌ర‌గ‌ళంః
ఎస్సీ వర్గీకరణపై సుప్రీం కోర్టు చారిత్రక తీర్పును వెల్లడిరచింది. ఎస్సీల ఉపవర్గీకరణకు రాష్టాల్రకే అధికారం ఉందని, వారికే అవకాశం ఇవ్వాలని సర్వోన్నత న్యాయస్థానం తన తీర్పులో చెప్పింది. ఎస్సీ వర్గీకరణ చెల్లుబాటుపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ చంద్రచూడ్‌ నేతృత్వంలోని ఏడుగురు న్యాయమూర్తుల ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది.

ఎస్సీ వర్గీకరణ అంశంపై ఈ ఏడాది ఫిబ్రవరిలో సుప్రీంకోర్టులో 3 రోజుల పాటు విచారణ జరిగింది. వర్గీకరణ సమర్థనీయమేనని నాడు కేంద్ర ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. సుదీర్ఘ వాదనల తర్వాత ఫిబ్రవరి 8న తీర్పును రిజర్వు చేసిన సుప్రీంకోర్టు.. తాజాగా నిర్ణయాన్ని వెల్లడిరచింది.. విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కోసం ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ అవసరమని చీఫ్‌ జస్టిస్‌ చంద్రచూడ్‌ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల ధర్మాసనం 6:1 నిష్పత్తితో తీర్పును వెల్లడిరచింది.దీనివల్ల ఎస్సీ ఎస్టీలోని వెనుకబడిన ఉప కులాలకు లబ్ది చేకూరుతుందని అభిప్రాయపడిరది. వర్గీకరణతో సమానత్వానికి భంగం వాటిల్లదని.. జస్టిస్‌ చంద్రచూడ్‌ పేర్కొన్నారు.

వర్గీకరణతో ఆర్టికల్‌ 14లోని సమానత్వ హక్కుకు భంగం వాటిల్లదు.. వర్గీకరణ అనేది ఆర్టికల్‌ 341/2కి ఉల్లంఘన కాదు .. ఆర్టికల్‌ 15, 16లో వర్గీకరణ వ్యతిరేకించే అంశాలూ లేవని తెలిపారు. ఎస్సీ, ఎస్టీల్లో క్రివిూలేయర్‌ను గుర్తించడానికి రాష్టాల్రు.. ఒక నిర్దిష్టమైన విధానాలు తీసుకురావాలని.. జస్టిస్‌ గవాయ్‌ పేర్కొన్నారు. కాగా..వర్గీకరణపై 2 దశాబ్దాల క్రితం ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు పక్కకుపెట్టింది. ఈ క్రమంలో ఎస్సీ, ఎస్టీరిజర్వేషన్ల ఉప వర్గీకరణపై సుప్రీంకోర్టు గురువారం కీలక తీర్పు వెలువరించింది.

విద్యా సంస్థల్లో ప్రవేశాలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన రిజర్వేషన్లను ఉపవర్గీకరణ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుందని అత్యున్నత న్యాయస్థానం స్పష్టంచేసింది. ఈమేరకు 2004లో ఐదుగురు సభ్యులు ఇచ్చిన తీర్పును తాజాగా విస్తృత ధర్మాసనం పక్కనబెట్టింది. 6:1 మెజారిటీతో సీజేఐ జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం తుది తీర్పు వెలువరించింది. తాజా తీర్పును అనుసరించి ప్రభుత్వాలు దీనిపై తదుపరి మార్గదర్శకాలు రూపొందించుకోవాలని సూచించింది. వ్యవస్థాగతంగా ఎదుర్కొంటున్న వివక్ష కారణంగా ఎస్సీ,ఎస్టీ వర్గాల వారు పైకి రాలేక పోతున్నారు. ఒక కులంలో ఉపవర్గాలు చేసేందుకు రాజ్యాంగంలోని 14వ అధికరణ అనుమతి కల్పిస్తుంది. అందుకే 2004 నాటి ఈవీ చిన్నయ్య తీర్పును మేం వ్యతిరేకిస్తున్నాం. రాష్టాల్రు ఉపవర్గీకరణ చేసుకునేందుకు అనుమతి కల్పిస్తున్నాం‘ అని సీజేఐ ధర్మాసనం స్పష్టంచేసింది. అణగారిన వర్గాల వారికి మరిన్ని ప్రయోజనాలు కల్పించేందుకు రిజర్వ్‌డ్‌ కేటగిరీలో రాష్టాల్రు ఉప వర్గీకరణ చేసుకోవచ్చని కోర్టు వెల్లడిరచింది.

ధర్మాసనంలో దీనికి అనుకూలంగా ఆరుగురు న్యాయమూర్తులు తీర్పు చెప్పగా.. జస్టిస్‌ బేలా ఎం.త్రివేది మాత్రం ఉప వర్గీకరణ సాధ్యం కాదంటూ వ్యతిరేకించారు.ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్సీ కోటా రిజర్వేషన్లలో 50శాతాన్ని వాల్మీకి, మజహబీ సిక్కు సామాజికవర్గాలకు తొలి ప్రాధాన్యంగా ప్రత్యేకిస్తూ 2006లో పంజాబ్‌ ప్రభుత్వం చట్టం తీసుకొచ్చింది. అయితే, ఎస్సీ రిజర్వేషన్ల ఉప వర్గీకరణ చెల్లదంటూ పంజాబ్‌, హరియాణా హైకోర్టు 2010లో తీర్పు వెలువరించింది. ఈవీ చిన్నయ్య వర్సెస్‌ ఆంధప్రదేశ్‌ ప్రభుత్వం కేసులో సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం 2004లో వెలువరించిన తీర్పును ఉల్లంఘించేలా పంజాబ్‌ చట్టం ఉందని హైకోర్టు అభిప్రాయపడిరది. షెడ్యూల్డ్‌ కులాల జాబితాలోకి ఏదైనా సామాజిక వర్గాన్ని చేర్చాలన్నా, తొలగించాలన్నా పార్లమెంటుకు మాత్రమే అధికారం ఉంటుందని, రాష్టాల్ర శాసనసభలకు కాదని ఈవీ చిన్నయ్య కేసులో సుప్రీంకోర్టు 2004లో తీర్పు చెప్పింది. దాన్నే పంజాబ్‌, హరియాణా తమ ఉత్తర్వులో హైకోర్టు ప్రస్తావించింది. దీంతో, హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ పంజాబ్‌ ప్రభుత్వం అప్పట్లో సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అనంతరం దీనిపై మరో 22 పిటిషన్లు దాఖలయ్యాయి. ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ కూడా ఇందులో వ్యాజ్యదారుగా ఉన్నారు. ఈ పిటిషన్లను విచారించిన అయిదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం.

2020లో ఈ వివాదాన్ని విస్తృత ధర్మాసనానికి బదిలీ చేసింది. దీనిపై సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం ఈ ఏడాది ఆరంభంలో విచారణ జరిపి తీర్పును రిజర్వ్‌ చేసింది. తాజాగా ఉపవర్గీకరణ చేసుకొనేలా రాష్టాల్రకు అనుమతినిస్తూ గురువారం కీలక తీర్పు వెలువరించింది. విచారణ సమయంలో కేంద్రం కూడా ఎస్సీ,ఎస్టీలో ఉపవర్గీకరణను సమర్థించింది. ఈ నేపథ్యంలో ఢల్లీిలో ఆయన విూడియాతో మాట్లాడుతూ.. ఈ విజయం కోసమే 30 ఏండ్లుగా పోరాటం చేస్తున్నామన్నారు. ఈ క్రమంలో చాలా మంది తమ ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. ఉద్యమాలను దెబ్బతీసే కుట్రలు ఎన్నో జరిగాయని విమర్శించారు. అయినా సహనం కోల్పోకుండా పట్టుదలతో పోరాటం చేసి విజయం సాధించామని తెలిపారు. 1994లో ప్రకాశం జిల్లా ఈదుమూడిలో వర్గీకరణ ఉద్యమాన్ని ప్రారంభించామన్నారు. జాతికి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దేందుకు పోరాడామని అన్నారు. న్యాయం కోసం ఎమ్మార్పీఎస్‌కు అండగా నిలిచిన వారందరికీ ఈ విజయం అంకితం ఇస్తున్నామన్నారు. ఉద్యోగ నియామకాల నోటిఫికేషన్లు కూడా సరిచేయాల్సిన అవసరం ఉందన్నారు. వర్గీకరణకు జనాభా లెక్కలతో పనిలేదని చెప్పారు. వర్గీకరణ కోసం ప్రధాని మోదీ చొరవ తీసుకున్నారనిచెప్పారు. అనుకూల తీర్పునిచ్చిన జడ్జిలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

ఏనాటికైనా ధర్మమే గెలుస్తుందని 2004 నవంబర్‌ 5న చెప్పానని గుర్తుచేశారు. అలాగే సుప్రీంకోర్టు తీర్పుతో మంద కృష్ణమాదిగ భావోద్వేగానికి గురయ్యారు.. విూడియా ఎదుట కంటనీరు పెట్టుకున్న మంద కృష్ణ.. తమ 30 ఏళ్ల పోరాటానికి న్యాయం జరిగిందంటూ వ్యాఖ్యానించారు. సుప్రీంకోర్టు తీర్పు న్యాయాన్ని బతికించిందంటూ పేర్కొన్నారు. కోటాలో సబ్‌కోటాపై సుదీర్ఘకాలంగా కోర్టులో కేసులు ఉన్నాయి.. ఈ క్రమంలో ఉవవర్గీకరణ కోరుతూ ఎమ్మార్పీఎస్‌ సుప్రీంను ఆశ్రయించింది.. పంజాబ్‌ ప్రభుత్వం సైతం వర్గీకరణపై సుప్రీంలో కేసు వేసింది.. ఈ ఏడాది ఫిబ్రవరిలో సుప్రీంలో 3 రోజులు సుదీర్ఘ వాదనలు సైతం జరిగాయి. ఇదిలాఉంటే.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు హైదరాబాద్‌ మాదిగ విశ్వరూప సభలో ప్రధాని మోదీ సైతం వర్గీకరణకు అనుకూలంగా మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణ న్యాయమైన డిమాండ్‌ అని, సుప్రీం కోర్టులో కూడా వర్గీకరణకు అనుకూలంగా తీర్పు వచ్చేలా కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుందని నాడు ప్రధాని మోదీ హావిూ ఇచ్చారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments