ఏర్పాట్లపై అధికారులతో సిఎస్ శాంతికుమారి సవిూక్ష
హైదరాబాద్,అక్షరగళం: : రాష్ట్రంలో ఇటీవల పదోన్నతి పొందిన 30వేల మంది ఉపాధ్యాయులతో సీఎం రేవంత్‌రెడ్డి ఆగస్టు 2న సమావేశం కానున్నారు. ఎల్‌బీ స్టేడియంలో నిర్వహించనున్న సమావేశం ఏర్పాట్లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సోమవారం సంబంధిత ఉన్నతాధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. డీజీపీ జితేందర్, ఆయాశాఖల కార్యదర్శులు శ్రీధర్, బుర్ర వెంకటేశం, హరిచందన, హైదరాబాద్ సీపీ శ్రీనివాస్‌రెడ్డి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి, సమాచార శాఖ స్పెషల్ కమిషనర్ హనుమంతరావు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎస్ శాంతి కుమారి మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేనంత పెద్దసంఖ్యలో రాష్ట్రంలోని ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించినట్లు తెలిపారు. ఈ పదోన్నతులు పొందిన ఉపాధ్యాయులందరితో సీఎం నేరుగా మాట్లాడేందుకు ఆగస్టు 2న సమావేశం ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఎల్బీ స్టేడియంలో దాదాపు రైన్ ప్రూఫ్ టెంట్స్ వేయించాలని సూచించారు. వివిధ జిల్లాల నుంచి వచ్చే ఉపాధ్యాయులకు తగు పార్కింగ్ ఇతర సౌకర్యాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సమావేశ ప్రాంగణంలో కావాల్సిన మంచినీరు, పారిశుధ్యం తదితర సౌకర్యాలను కల్పించాలని సూచించారు.