అకడమిక్‌ క్యాలెండర్‌ విడుదల

Estimated read time 0 min read

రాజకీయాలకు అతీతంగా విద్యాలయాలు ఉండాలి….
అధికారులకు లోకేశ్‌ ఆదేశాలు
అంధ్ర‌ప్ర‌దేశ్,అక్ష‌ర‌గ‌ళంః
విద్యాశాఖా మంత్రి నారా లోకేశ్‌ ’అకడమిక్‌ క్యాలెండర్‌’ను విడుదల చేశారు. రాజకీయాలకు అతీతంగా పాఠశాల విద్య అకడమిక్‌ క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. నాయకుల బొమ్మలు, పార్టీల రంగులు లేకుండా రూపకల్పన చేశారు. కాగా ఆగస్టులో స్కూల్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీల ఎన్నికలకు మంత్రి లోకేశ్‌ ఆదేశాలు ఇచ్చారు. కస్తూరిబా గాంధీ విద్యాలయాల్లో పోస్టుల భర్తీకి మంత్రి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. అనంతరం ఉండవల్లి నివాసంలో పాఠశాల విద్యా శాఖ ఉన్నతాధికారులతో ఆయన సవిూక్షించారు.

ప్రభుత్వ విద్యాలయాలు రాజకీయాలకతీతంగా ఉంచాలని అధికారులకు స్పష్టం చేసినట్లు ఆయన ఎక్స్‌ వేదికగా వెల్లడిరచారు. స్కూల్‌ మేనేజ్‌ మెంట్‌ కమిటీల పదవీకాలం జూలైతో పూర్తయినందున ఆగస్టులో కమిటీల ఎన్నికలు పూర్తిచేయాలని సూచించాను.

పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం నాణ్యత, మౌలిక సదుపాయాల మెరుగుదల పర్యవేక్షణ బాధ్యతను పేరెంట్స్‌ కమిటీలకు అప్పగించాలని నిర్ణయించాం. కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో ఖాళీగా ఉన్న టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ పోస్టుల భర్తీకి విధివిధానాలు ఖరారు చేయాల్సిందిగా సూచించానని అన్నారు

You May Also Like

More From Author