
- పద్మానగర్ ఫేస్ 2 లో ఘనంగ అయ్యప్ప పడిపూజ
- ముఖ్యాతిధిగా హజరైన ఎమ్మేల్యే కెపి వివేకానందా
అక్షరగళం, కుత్భుల్లాపూర్: అయ్యప్ప శరణు ఘోషతో భక్తి పరవశులయ్యారు అక్కడివారు.. పజ్జెనిమిది మెట్ల మహా పడి పూజను కలనులారా గాంచి ముగ్దులయ్యారు. కుత్బుల్లాపూర్ సర్కిల్ పద్మానగర్ పేజ్ 2 రింగ్ రోడ్ లో మంగళవారం రాత్రి గురుస్వామి శ్రీనివాస్ ఆద్వర్యంలో నిర్వహించిన 18వ మహా పడిపూజ కార్యక్రమానికి బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ముఖ్యఅతిథిగా హాజరై స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. హరిహర పుత్ర అయ్యప్ప శరణం ధర్మ స్థాపనకు, ధర్మ పరిరక్షణకు మార్గమని, స్వామి వారి దయతో ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని ఈ సంద్భంగా ఆయన ఆకాంక్షించారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గ యూత్ అధ్యక్షులు దూదిమెట్ల సోమేష్ యాదవ్, నాయకులు సత్యనారాయణ యాదవ్, రమణా రెడ్డి, రాజు యాదవ్, రమ్మీ గౌడ్, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు