aksharagalam.com

“కోడేం కిచెన్” ను ప్రారంభం

ఈ రోజు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి బాచుపల్లిలోని రాజీవ్ గాంధీ నగర్ లో కోడేం శ్రీశైలం, ధరణి కుమార్ ల ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటుచేసిన “కోడేం కిచెన్” మొదటి ఔట్లెట్ ను బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…..వినూత్న రుచులను వినియోగదారులకు అందిస్తూ “కోడేం కిచెన్” దినదినాభివృద్ధి చెందాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు ఆగం రాజు, గాజుల సుజాత, మాజీ కో ఆప్షన్ సభ్యులు అభిషేక్ రెడ్డి, చంద్రగిరి సతీష్, డివిజన్ అధ్యక్షులు కాదరయ్య,నాయకులు సాంబశివ రెడ్డి, ప్రవీణ్ గౌడ్, సలీం ఖాన్, మహేందర్, పూజారి తదితరులు పాల్గొన్నారు

Exit mobile version